Fake News, Telugu
 

పాకిస్థాన్‌లోని వరుణ దేవాలయాన్ని ఇప్పుడు మరుగుదొడ్డిగా వాడుతున్నారు అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

పాకిస్థాన్‌లోని కరాచీ దగ్గర ఉన్న వరుణ దేవాలయాన్ని ఇప్పుడు మరుగుదొడ్డిగా వాడుతున్నారని, మైనారిటీ హిందువుల పరిస్థితి ఇది అని చెప్తున్న ఒక పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంట్లో నిజమెంతో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: పాకిస్థాన్‌లోని కరాచీ దగ్గర ఉన్న వరుణ దేవాలయాన్ని ఇప్పుడు మరుగుదొడ్డిగా వాడుతున్నారు.

ఫ్యాక్ట్ (నిజం): కరాచీలోని మనోర దీవిలో ఉన్న వరుణ దేవాలయం దురవస్థలో ఉండగా, 2015లో అమెరికా ప్రభుత్వం వారి AFCP (యూ.ఎస్ అంబాసడార్స్ ఫండ్ ఫర్ కల్చరల్ పప్రేజర్వేషన్) ద్వారా బాగుచేసే పనులు మొదలయ్యి 2018లో పూర్తి అయ్యాయి. అంచేత పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చెప్తున్న వరుణ దేవాలయం పాకిస్థాన్‌లోని కరాచీలోని మనోర దీవిలో ఉంది. వార్త కథనాల ప్రకారం 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఈ దేవాలయాన్ని మూసివేశారు. జియో టీవీ రిపోర్ట్ ప్రకారం, వేడిగాలులు మరియి ఆక్రమణల వల్ల ఈ దేవాలయం దురవస్థలోకి వెళ్ళింది.

అయితే 2015లో అమెరికా ప్రభుత్వం వారి AFCP (యూ.ఎస్ అంబాసడార్స్ ఫండ్ ఫర్ కల్చరల్ పప్రేజర్వేషన్) ద్వారా బాగుచేసే పనులు మొదలయ్యాయి. దీని గురించి పాకిస్థాన్‌లోని అమెరికన్ ఎంబసీ వారి వెబ్సైటులో ఉన్న సమాచారాన్ని  ఇక్కడ చదవచ్చు. ఈ పనుల కోసం AFCP $250,000 మొత్తాన్ని ఇస్తుందని ఇందులో రాసి  ఉంది.  దీని గురించి వచ్చిన వార్త కథనాల్ని మీరు ఇక్కడ, ఇక్కడ  మరియు ఇక్కడ చదవచ్చు.

వరుణ దేవాలయాన్ని బాగుచేసే పనులు 2018 జనవరి 25వ తారీఖున పూర్తయ్యాయి, ఈ ప్రాజెక్టు పూర్తయ్యిన  సందర్భంగా యూ.ఎస్ కాన్సల్ జనరల్ గ్రేస్ షెల్టన్ అక్కడికి వెళ్లారు. దీనికి సంభందించిన వార్త కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు.

పోస్టులో ఉన్నట్లుగా వరుణ దేవాలయాన్ని మరుగుదొడ్డిగా వాడుతున్నారు అనడానికి ఏమైనా రుజువులున్నాయా అని వెతుకగా, కొన్ని బ్లాగ్ పోస్టులలో  జీవరాజ్ అనే ఒకతను ఈ దేవాలయాన్ని చూసుకొంటున్నట్టు రాసి ఉంది. దేవాలయం గదులు ఇప్పుడు మరుగుదొడ్లగా వాడుతున్నారు అతను 2008లో డైలీ టైమ్స్ వారికి చెప్పినట్లు వీటిలో రాసి ఉంది. కానీ డైలీ టైమ్స్ వారి ఆర్టికల్ కానీ కథనం కానీ మాకు లభించలేదు. వరుణ దేవాలయం దగ్గర కొందరు వ్లాగ్స్ షూట్ చేసారు ఆ వీడియోలని ఇక్కడ మరియు ఇక్కడ  చూడవచ్చు.

చివరిగా, పాకిస్థాన్‌లోని వరుణ దేవాలయాన్ని ఇప్పుడు మరుగుదొడ్డిగా వాడుతున్నారు అని తప్పుగా షేర్ చేస్తున్నారు. ఈ దేవాలయాన్ని 2018లోనే పునరుద్ధరించారు.

Share.

About Author

Comments are closed.

scroll