Fake News, Telugu
 

నరేంద్ర మోదీ టీ అమ్మాడని ప్రచారంలో ఉన్న వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌ని 1887లోనే నిర్మించారు, 1973లో కాదు

0

నరేంద్ర మోదీ ఆరేళ్ళ వయసులో గుజరాత్‌లోని వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో టీ అమ్మారన్న వార్త ప్రచారంలో ఉంది.  ఐతే ఇటీవల సోషల్ మీడియాలో వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌ని 1973లో కట్టారని, అలాంటప్పుడు 1950లో పుట్టిన మోదీ ఆరేళ్ళ వయసులో అనగా 1956లో టీ ఎక్కడ అమ్మడాని ప్రశ్నిస్తున్న పోస్ట్ ఒకటి విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ విషయానికి సంబంధించిన నిజమెంటో చూద్దాం.

క్లెయిమ్: నరేంద్ర మోదీ టీ అమ్మానని చెప్పుకునే వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌ని 1973లో నిర్మించారు. అంతకు ముందు ఆ స్టేషన్ లేదు.

ఫాక్ట్(నిజం): భారతీయ రైల్వే వెబ్సైటులో భారతీయ రైల్వే చరిత్రకి సంబంధించిన డాక్యుమెంట్‌లలో మెహసన-వాద్‌నగర్ మధ్య రైల్వే లైన్‌ని 21 మార్చ్ 1887న ప్రారంభించినట్టు పేర్కొన్నారు. భారత్‌లో రైల్వే నిర్వహణకు సంబంధించి మాకు లభించిన Administration Report on the Railways in India for 1887-88 డాక్యుమెంట్‌లో కూడా మెహసన – వాద్‌నగర్ మధ్య రైల్వే లైన్‌ని 21 మార్చ్ 1887న ప్రారంభించినట్టు పేర్కొన్నారు. అలాగే భారతీయ రైల్వే చరిత్రకి సంబంధించిన పలు పుస్తకాలు, రీసెర్చ్ పేపర్లలో కూడా వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌ 1887 నుండే అందుబాటులో ఉందని చెప్తున్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పశ్చిమ రైల్వేస్ వెబ్సైటులో 1973 కన్నా ముందునుండే వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌ ఉందని  చెప్పడానికి ఆధారాలు మాకు లభించాయి. భారతీయ రైల్వే చరిత్రకి సంబంధించిన ఒక డాక్యుమెంట్‌లో మెహసన – వాద్‌నగర్ మధ్య రైల్వే లైన్‌ని 21 మార్చ్ 1887న ప్రారంభించినట్టు పేర్కొన్నారు. అలాగే వాద్‌నగర్–ఖేరాలు మధ్య మధ్య రైల్వే లైన్‌ని 12 డిసెంబర్ 1888న ప్రారంభించినట్టు పేర్కొన్నారు. దీన్నిబట్టి వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌ 1887 నుండే అందుబాటులో ఉందని స్పష్టమవుతుంది.

అలాగే దక్షిణ మధ్య రైల్వే వెబ్సైటులోని ఒక డాక్యుమెంట్‌లో భారతీయ రైల్వేలకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్‌ రిపోర్ట్ గురించి ప్రస్తావించారు. ఇంటర్నెట్‌లో అడ్మినిస్ట్రేషన్‌ రిపోర్ట్‌కి సంబంధించిన సమాచారం కోసం వెతకగా 1887 -1888 మధ్య భారత్‌లో రైల్వే నిర్వహణకు సంబంధించి మాకు లభించిన Administration Report on the Railways in India for 1887-88 డాక్యుమెంట్‌లో కూడా మెహసన – వాద్‌నగర్ మధ్య రైల్వే లైన్‌ని 21 మార్చ్ 1887న ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఐతే ఈ డాక్యుమెంట్‌లో మెహసన – వాద్‌నగర్ మధ్య రైల్వే లైన్‌ని అప్పటి స్థానిక రాజులైన గైక్వాడ్స్ నిర్మించినట్టు పేర్కొన్నారు.

అలాగే వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌ గురించి ప్రస్తావించిన భారతీయ రైల్వే చరిత్రకి సంబంధించిన పలు పుస్తకాలు, రీసెర్చ్ పేపర్లు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ పుస్తకాలు, రీసెర్చ్ పేపర్లు కూడా వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌ 1887 నుండే అందుబాటులో ఉందన్న విషయన్ని పునరుద్ఘాటిస్తున్నాయి.

చివరగా, నరేంద్ర మోడీ టీ అమ్మాడని ప్రచారంలో ఉన్న వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌ని 1887లోనే నిర్మించారు, 1973లో కాదు.

Share.

About Author

Comments are closed.

scroll