Fake News, Telugu
 

విశ్వాసం ఆధారిత హీలింగ్ గురించి ఉపాసన కామినేని చెప్పిన దాన్ని తప్పుదారి పట్టించే వాదనలతో ప్రచారం చేస్తున్నారు

0

ఉపాసన కామినేని ఇంటర్వ్యూ వీడియోతో కూడిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ‘చిరంజీవి కోడలు…. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి మందులు వేసుకుంటే స్వస్థత కలుగుతుంది అని స్పష్ఠంగా చెబుతుంది’ అని పోస్టులో రాసి ఉంది. ఇందులోని  నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి మందులు వేసుకుంటే స్వస్థత కలుగుతుంది అని స్పష్ఠంగా చెప్పిన ఉపాసన కామినేని.

ఫాక్ట్ (నిజం): జర్నలిస్ట్ ప్రేమకి ఉపాసన ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వస్థత (హీలింగ్) గురించి మాట్లాడుతూ, ‘మన పురాణాల ప్రకారం, మాత్రలు వేసుకొనే ముందు మహా మృత్యుంజయ మంత్రం చదివి వేసుకొంటే, మన ఒంటిమీద ఆ మాత్ర బాగా పనిచేస్తుంది’ అని చెప్పారు.  అలాగే స్వస్థత అనేది 50% మెడికల్ సైన్స్ అయితే మిగిలిన 50% మన మెదడులోని ఉంది అని, స్వస్థత కోసం రెండు ఒకటిగా కలిసి రావాలి అని చెప్పారు. క్రైస్తవులు అయితే యేసుని, ఇస్లాం మతం వారు అల్లాని తలచుకొని, హిందువులు మహా మృత్యుంజయ మంత్రం చదివి మాత్రలు వేసుకొంటే ఎంత పాజిటివీటిని సృష్టిస్తుందో ఊహించండి అని చెప్పారు.  ఈ ఇంటర్వ్యూలో తను క్రైస్తవ మతం గురించి మాత్రమే కాకుండా వేరే మతాల విశ్వాసాల గురించి కూడా మాట్లాడారు, అందుచేత పోస్టులో చెప్తున్నది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

కీ-వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఉపాసన కామినేని, జర్నలిస్ట్ ప్రేమకి ఇచ్చిన ఇంటర్వ్యూ లభించింది. తను వైరల్ పోస్టులో చెప్పిన మాటలు 32 నిమిషాల 48 సెకన్ల దగ్గర నుండి ఈ వీడియోలో ఉన్నాయి. విశ్వాస ఆధారిత స్వస్థత (హీలింగ్) గురించి మాట్లాడుతూ, ‘స్వస్థత 50% మెడికల్ సైన్స్ అయితే మిగిలిన 50% మన మెదడులోని ఉంది అని ,రెండు ఒకటిగా కలిసి రావాలి స్వస్థత కోసం’ అని చెప్పారు. పాజిటివిటి మరియు విశ్వాసం ఉన్నది ఏదైనా మనకి స్వస్థత కలుగచేయగలదని ఆమె చెప్పారు.

తాను మాట్లాడుతూ ‘మన పురాణాల ప్రకారం, మాత్రలు వేసుకొనే ముందు మహా మృత్యుంజయ మంత్రం వేసుకొంటే అది మన ఒంటిమీద బాగా పనిచేస్తుంది’ అని అన్నారు. అంతే కాకుండా ‘క్రైస్తవులు అయితే యేసుని, ఇస్లాం మతం వారు అల్లాని తలచుకొని, హిందువులు మహా మృత్యుంజయ మంత్రం చదివి మాత్రలు వేసుకొంటే ఎంత పాజిటివిటిని సృష్టిస్తుందో ఊహించండి’ అని జర్నలిస్ట్ ప్రేమతో చెప్పారు. ‘ఇది ఎంతవరకు పనిచేస్తుందో  లేదో నాకు తెలీదు కానీ, ఇది నా మెదడుకి నేను కాస్త మెరుగు పడ్డాను అనే  భావనను అది  కలిగిస్తుంది’ అని అన్నారు.

వైరల్ పోస్టులో ఈ ఇంటర్వ్యూలోని భాగాలను ఎడిట్ చేసిన వీడియోని పెట్టి, తాను యేసుక్రీస్తు నామముతో ప్రార్థన చేసి మందులు వేసుకుంటే స్వస్థత కలుగుతుంది అని స్పష్ఠంగా చెబుతుంది అని చెప్తున్నారు. నిజానికి తాను అన్ని మతాల గురించి, విశ్వాసం ఆధారిత స్వస్థత (హీలింగ్) గురించి చెప్పారు.

చివరిగా, విశ్వాసం ఆధారిత స్వస్థత (హీలింగ్) గురించి ఉపాసన కామినేని చెప్పిన మాటలని, తప్పుదారి పట్టించే వాదనలతో  ఈ పోస్టు ద్వారా ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll