Fake News, Telugu
 

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మళ్లీ అధికారంలోకి వస్తే అంబేడ్కర్ స్మారక చిహ్నాలను తొలగించి వాటి స్థానంలో టెంట్ హౌస్‌లను తెరుస్తామని అనలేదు

0

మళ్ళీ మేము అధికారంలోకి వస్తే, అన్ని అంబేడ్కర్ విగ్రహాలు తొలగిస్తాం, అంబేడ్కర్ పేరు మీద ఉన్న విద్యాసంస్థలు  సంస్థలు అంతం చేస్తాము, ఆస్థానంలో కొత్త టెంట్ హౌస్ తెరుస్తాం అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు అని చెప్తూ ఉన్న పలు పోస్టులు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి మద్దతుగా యోగి ఆదిత్యనాథ్ అంబేడ్కర్ గురించి మాట్లాడుతున్న వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఇలాంటి మరో పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మేము మళ్ళీ అధికారంలోకి వస్తే, అన్ని అంబేడ్కర్ విగ్రహాలు తొలగించి ఆస్థానంలో టెంట్ హౌస్‌లను తెరుస్తాం అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో 25 ఫిబ్రవరి 2023 నాడు ఉత్తరప్రదేశ్ బడ్జెట్ సమావేశాలలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రసంగానికి సంబంధించినది. వాస్తవంగా, సభలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, అంబేడ్కర్ పట్ల సమాజ్ వాదీ పార్టీ వైఖరిని విమర్శిస్తూ ఈ వ్యాఖ్యలు చేసారు. యూపీ సీఎం యోగి మాట్లాడుతూ, “మీరు (సమాజ్ వాదీ పార్టీ) భీంరావ్ అంబేడ్కర్ కి ఎలాంటి మర్యాద ఇచ్చారో అందరికి తెలుసు, ఆయన పేరు మీద ఉన్న సంస్థల పేర్లు మార్చారు, ఇంకా ఏం చేయలేదు చెప్పండి, సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తే, అన్ని అంబేడ్కర్ స్మారక కేంద్రాలను తొలగించి టెంట్,హౌస్‌లు,పెళ్లిళ్ల ఫంక్షన్ హాల్లు తెరుస్తామని ఎన్నికలలో ప్రకటన కూడా చేసారు, మీరు ఇప్పుడు సామజిక న్యాయం గురించి మాట్లడం విడ్డూరంగా ఉంది ” అని అన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోని గమనిస్తే, వీడియోలో ‘UP Tak’ లోగో ఉండటం మనం గమనించవచ్చు, దీని ఆధారంగా తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇవే దృశ్యాలు కలిగిన కొంత అధిక నిడివి గల వీడియోని ‘UP Tak’ తమ యూట్యూబ్ ఛానెల్‌లో 28 ఫిబ్రవరి 2023 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియో యొక్క వివరణలో, యోగి ఆదిత్యనాథ్ ఎస్పీకి(సమాజ్ వాదీ పార్టీ) ఆ రోజులను గుర్తు చేశారు; ఇంతకుముందు అంబేద్కర్‌ను అవమానించేవాళ్ళు, ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడుతున్నారు.(హిందీ నుండి తెలుగు అనువాదం) అని రాసి ఉంది.

ఈ సమాచారం ఆధారంగా ఈ యోగి ఆదిత్యనాథ్ ప్రసంగం యొక్క పూర్తి వీడియో కోసం తగిన కీవర్డ్‌లను ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ యోగి ఆదిత్యనాథ్ ప్రసంగం యొక్క పూర్తి నిడివి గల వీడియోని ‘Live Hindustan’ అనే వార్త సంస్థ తమ యూట్యూబ్ ఛానెల్‌లో 25 ఫిబ్రవరి 2023 నాడు లైవ్ టెలికాస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియో 2023 ఉత్తరప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకి సంబంధించినది అని తెలుస్తుంది.

ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, వైరల్ వీడియో క్లిప్పింగ్ లోని దృశ్యాలు  టైంస్టాంప్ 1:04:13వద్ద మొదలై, టైంస్టాంప్ 1:04:36 వద్ద ముగుస్తుంది అని తెలిసింది. యూపీ సీఎం యోగి మాట్లాడుతూ, “అంబేడ్కర్ దళితులను శృధ్రులూ అని పేర్కొనవద్దు అని చెప్పాడు, మీరు (సమాజ్ వాదీ పార్టీ)భీంరావ్ అంబేడ్కర్ కి ఎలాంటి మర్యాద ఇచ్చారో అందరికీ తెలుసు, ఆయన పేరు మీద ఉన్న సంస్థల పేర్లు మార్చారు, ఇంకా ఏం చేయలేదు చెప్పండి, మీరు (సమాజ్ వాదీ పార్టీ) ఎన్నికలలో ప్రకటన కూడా చేసారు, మేము (సమాజ్ వాదీ పార్టీ)అధికారంలోకి వస్తే, అన్ని అంబేడ్కర్ స్మారక కేంద్రాలను తొలగించి టెంట్ హౌస్, పెళ్లిళ్ల ఫంక్షన్ హాల్లు తెరుస్తామని ఎన్నికలలో ప్రకటన కూడా చేసారు, మీరు ఇప్పుడు సామజిక న్యాయం గురించి మాట్లడం విడ్డూరంగా ఉంది ” అని అన్నారు. వాస్తవంగా, సభలో యోగి ఆదిత్యనాథ్ సమాజ్ వాదీ పార్టీని విమర్శిస్తూ ఈ వ్యాఖ్యలు చేసారు. ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తున్న “టైమ్స్ అఫ్ ఇండియా” కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మళ్లీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ స్మారక చిహ్నాలను తొలగించి వాటి స్థానంలో టెంట్ హౌస్‌లను తెరుస్తామని అని అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll