Fake News, Telugu
 

చంద్రుడిపై చంద్రయాన్-3 రికార్డు చేసిన దృశ్యాలంటూ సంబంధం లేని దృశ్యాలను షేర్ చేస్తున్నారు

0

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 23 ఆగస్టు 2023న చంద్రయాన్-3 యొక్క ల్యాండర్ మాడ్యూల్ అయిన విక్రమ్ ల్యాండర్‌ని చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసి ప్రగ్యాన్ రోవర్‌ని విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 పంపిన దృశ్యాలంటూ కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉన్నాయి. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

దృశ్యం 1:

చంద్రయాన్-3 చంద్రుడిపై చిత్రీకరించిన తొలి వీడియో అని చెప్తూ ఒక రోవర్‌ను చూపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ముందుగా వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫొటోని నాసా అధికారిక వెబ్‌సైట్లో గుర్తించాం. ఈ రోవర్ 2011లో అంగారక గ్రహం పైకి ప్రయోగించబడ్డ “క్యూరియాసిటీ” రోవర్ అని నాసా వెబ్‌సైట్లో పేర్కొన్నారు. 2014 ఏప్రిల్, మే మధ్యలో రోవర్ చేతికి ఉన్న కెమెరా ద్వారా తీసిన అనేక ఫొటోలను కలపగా ఈ ఫోటో రూపొందిందని వెబ్‌సైట్లో వెల్లడించారు. ఇక చంద్రయాన్-3 ల్యాండింగ్ తర్వాత ఇస్రో విడుదల చేసిన దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు.

దృశ్యం 2:

పై దృశ్యం 2020లో అంగారకుడిపైకి నాసా ప్రయోగించిన “పర్సెవెరెన్స్ రోవర్” తీసిన ఫోటో. 31 జనవరి 2023లో రోవర్ ఈ ఫోటోని తీసినట్లుగా నాసా వెబ్‌సైట్ పేర్కొంది.

దృశ్యం 3:

పై దృశ్యం 2003లో అంగారకుడిపైకి నాసా ప్రయోగించిన “ఆపర్చునిటీ రోవర్” తీసిన ఫోటో. 29 ఏప్రిల్ 2007లో రోవర్ తన టైరు గుర్తులు చూపుతున్నఈ ఫోటోని తీసినట్లుగా నాసా వెబ్‌సైట్ పేర్కొంది.

దృశ్యం 4:

పై దృశ్యం 2020లో అంగారకుడిపైకి నాసా ప్రయోగించిన “పర్సెవెరెన్స్ రోవర్” తీసిన ఫోటో. 10 సెప్టెంబర్ 2021లో రోవర్ ఈ సెల్ఫీని తీసినట్లుగా నాసా వెబ్‌సైట్ పేర్కొంది.

దృశ్యం 5:

పై వీడియోలో ఉన్న దృశ్యాలను అంగారకుడిపై పరిశోధనలు జరుపుతున్న నాసాకు చెందిన “పర్సెవెరెన్స్ రోవర్” 13 జూన్ 2022న చిత్రీకరించినట్లుగా నాసా వెబ్‌సైట్ పేర్కొంది.

Share.

About Author

Comments are closed.

scroll