Fake News, Telugu
 

సంబంధం లేని వీడియో క్లిప్పులను భారతదేశంలో ‘మెడిసిన్-జిహాద్’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

‘వైద్య పరికరాలు జిహదిలా కొత్త మరణ ఆయుధాలుగా వినియోగించడం ప్రారంభించిన జిహాదిలు’ అని చెప్తూ మెడిసిన్ క్యాప్సూల్ ఓపెన్ చేస్తే అందులోనుండి చిన్న చిన్న ఇనుప మొలలు కిందపడుతున్న వీడియో షేర్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మెడిసిన్ క్యాప్సూల్ లో చిన్న చిన్న మొలలు నింపుతున్న జిహాదిలు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని వీడియోలో కనిపించే రెండు క్లిప్పులు భారత్‌కు సంబంధించినవి కావు. ఒక క్లిప్ పాకిస్తాన్ లో తయారు చేయబడిన మరియు విక్రయించబడే మెడిసిన్ కి సంబంధించింది కాగా మరొక వీడియో క్లిప్ బోస్నియా మరియు హెర్జెగోవినాకు చెందిన ఒక సంస్థ తయారుచేసే మెడిసిన్ ది. FACTLY ఈ వీడియోల యొక్క ప్రామాణికత గురుంచి కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ, ఈ వీడియోలకి భారత దేశానికి ఎటువంటి సంబంధం లేదు, ఈ మందులు భారతదేశంలో విక్రయించబడవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్ట్ లోని వీడియోని రెండు వేర్వేరు మందులకు సంబంధించిన రెండు వేర్వేరు క్లిప్పులు ఉండడం గమనించొచ్చు. ఆ రెండు క్లిప్స్ ని వేర్వేరుగా పరిశీలిద్దాం.

క్లిప్ 1:

ఈ క్లిప్ లో కనిపించే మెడిసిన్ పేరుతో గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా అచ్చం ఇలాంటిదే ఒక బెటర్ క్వాలిటీ వీడియో ఒకటి యుట్యూబ్ లో కనిపించింది. ఈ వీడియోలో కనిపిస్తున్న మెడిసిన్ షీట్ ని జాగ్రత్తగా గమనించినప్పుడు ఆ షీట్ పై ‘Esoral 20 mg capsules’, ‘Manufactured by: City Pharmaceutical Laboratories…. Sector 5…. Karachi’. పైగా మెడిసిన్ షీట్ పై ఉర్దూలో రాసి ఉండడం గమనించొచ్చు.

పైన తెలిపిన మెడిసిన్ యొక్క బ్రాండ్ పేరు ఆధారంగా వెతకగా ‘City Pharmaceutical Lbaoratories’ పేరుతో ఉన్న ఒక ఫేస్‌బుక్ పేజీ కనిపించింది. ఈ ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసిన ఒక మెడిసిన్ ఫోటో పైన ఉన్న లోగో  పోస్టులోని వీడియోలో ఉన్న మెడిసిన్ ప్యాకెట్ పైన ఉన్న ఒకేలా ఉండడం గమనించొచ్చు. ఇంకా ఈ ఫేస్‌బుక్ పేజీలోని ఎబౌట్ సెక్షన్ లో పాకిస్తాన్ డొమైన్ నేమ్ తో ఒక వెబ్సైటు అడ్రస్ (http://www.citypharma.com.pk/) ఉంది.

ఈ ఫేస్‌బుక్ పేజీలో అప్లోడ్ చేసిన ఒక ఫోటోలో ‘Muhammad Nadeem’ అనే వ్యక్తిని ట్యాగ్ చేసారు, ఐతే ఆ వ్యక్తీ ఫేస్‌బుక్ పేజీలోని సమాచారం ప్రకారం అతను పాకిస్తాన్ లోని కరాచిలో ‘City Pharmaceutical Lbaoratories’ ఇంపోర్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నట్టు ఉంది.

పాకిస్తాన్ గవర్నమెంట్ వెబ్సైటులోని  ‘Approved Renewal of Drug Manufacturing Licenses to 07 (seven) companies’ లిస్టులో ఇదే కంపెనీ పేరు మరియు అడ్రస్ ఉన్న కంపెనీ లిస్టు అయింది. దీన్ని బట్టి  వీడియోలో చూపించిన మెడిసిన్ ప్యాకెట్ భారతదేశానికి సంబంధించింది కాదని, పాకిస్థాన్‌కు సంబంధించినదని చెప్పొచ్చు.

Esoral అనేది నిజానికి Eskayef Pharmaceuticals Ltd అనే ఒక బంగ్లాదేశ్ కి చెందిన కంపెనీ ప్రోడక్ట్, కానీ పోస్ట్ లోని వీడియోలో ఉన్న మెడిసిన్ ప్యాకెట్ పై ఉన్న లోగో Eskayef Pharmaceuticals Ltd డి కాదు. పోస్ట్ లోని వీడియోలో ఉన్న ‘Esoral 20 mg’ మెడిసిన్ ప్యాకెట్ డిజైన్, బంగ్లాదేశ్‌లో విక్రయించే Eskayef’s ‘Esoral 20 mg’ ప్యాకెట్ డిజైన్ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పైగా, Eskayef Pharmaceuticals Ltd యొక్క తయారీ యూనిట్ పాకిస్తాన్‌లో లేదు. కాబట్టి, పాకిస్తాన్ కంపెనీ అదే పేరుతో అదే మెడిసిన్ తయారు చేస్తూ ఉండొచ్చు.

క్లిప్ 2:

ఈ క్లిప్ కి సంబంధించి ఎక్కువ నిడివి గల ఒక వీడియో యూట్యూబ్ లో దొరికింది

ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇది Bosnalijek అనే ఒక బోస్నియా ఫార్మాస్యూటికల్ కంపెనీ యొక్క ‘Enterofuryl 200 mg’ అనే మెడిసిన్ అని తెలిసింది.

పైగా ‘Stop Fake’ అనే కజకిస్తాన్ ఫాక్ట్-చెకింగ్ వెబ్సైట్ ఈ వీడియో వైరల్ అయినప్పుడు కజకిస్తాన్ అధికారుల స్పందనని రిపోర్ట్ చేసింది. అది కింద చూడొచ్చు. వీటన్నిటి బట్టి ఈ మెడిసిన్ భారత దేశానికి సంబంధించింది కాదని అర్ధమవుతుంది.

FACTLY ఈ వీడియోల యొక్క ప్రామాణికతపై గురుంచి కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ, ఈ వీడియోలకి భారత దేశానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో మాత్రం భారతదేశంలో హిందువులకు వ్యతిరేకంగా ‘మెడిసిన్-జిహాద్’ కి సంబంధించింది కాదు మరియు ఈ మందులు భారతదేశంలో విక్రయించబడవు.

చివరగా, సంబంధం లేని వీడియో క్లిప్పులను భారతదేశంలో ‘మెడిసిన్-జిహాద్’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll