Fake News, Telugu
 

సంబంధంలేని ఫోటోలు బ్రిటిష్ మరియు మోదీ ప్రభుత్వాల హయాంలో రైతుల నిరసనలంటూ షేర్ చేస్తున్నారు

0

1917 నుండి 2020 వరకు ప్రభుత్వాలే మారాయి తప్ప విధానాలు కాదు అని చెప్తూ 1917లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంపారన్ రైతులు నిరసన తెలుపుతున్నారని చెప్తున్న ఫోటో మరియు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతుల ఫోటోల కోలాజ్ షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 1917లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంపారన్ రైతులు నిరసన తెలుపుతున్న ఫోటో మరియు 2020లో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతుల ఫోటో.

ఫాక్ట్ (నిజం):  1917 తీసిందని చెప్తున్న ఫోటో నిజానికి 1877లో తీసిన ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ లో నీలిమందు తోటల్లో పనిచేసేవారి ఫోటో. ఈ ఫోటోలో రైతులు కేవలం నిలబడి ఉన్నారు, నిరసన తెలపట్లేదు. 2020 ఫోటో అని చెప్తున్నది నిజానికి 2017లో రైతుల రుణాలు మాఫీ చేయాలనీ తమిళనాడు రైతులు ఢిల్లీలో నిరసనలు చేపట్టిన సంధర్బానికి సంబంధించినవి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పైన ఫోటో:

పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ కోలాజ్ లో 1917లో తీసిందిగా చెప్తున్న ఫోటోని పోలిన ఫోటో ఒకటి J. Paul Getty Museum వెబ్సైటులో కనిపించింది. వెబ్సైటులో ఈ ఫోటోకి సంబంధించి ఇచ్చిన వివరణ ప్రకారం ఈ ఫోటో 1877లో ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ లో తీసినదిగా తెలుస్తుంది. పైగా ఈ వివరణ ప్రకారం ఈ ఫోటోలో కనిపిస్తున్నది నీలిమందు తోటల్లో పనిచేసేవారు, ఐతే ఈ ఫోటోలో రైతులు నిరసన తెలుపుతున్నట్టు ఎక్కడ కూడా లేదు.

కింద ఫోటో 2:

ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని ప్రచురించిన కొన్ని 2017 వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ  కథనాల ప్రకారం ఈ ఫోటో 2017లో రైతుల రుణాలు మాఫీ చేయాలంటూ తమిళనాడుకి చెందిన రైతులు ఢిల్లీలో నిరసన చేపట్టిన సంధర్బానికి సంబంధించినవి. ఇదే విషయం తెలుపుతున్న మరొక వార్తా కథనం ఇక్కడ చదవొచ్చు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, సంబంధంలేని పాత ఫోటోలను ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల నిరసనలకు ముడిపెడుతున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll