Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియోలని బెంగాల్ లో హిందువుల ‘రివెంజ్ అటాక్’ అని షేర్ చేస్తున్నారు

0

ఇటీవల బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన గొడవల తరువాత, హిందువులు ముస్లింల పై రివెంజ్ తీసుకుంటున్నారని ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన గొడవల తరువాత, హిందువులు ముస్లింల పై దాడి చేస్తున్న వీడియో.

ఫాక్ట్: సంబంధం లేని మూడు వేరు వేరు వీడియోలను జత చేసి బెంగాల్ లో హిందువులు ముస్లింల పై దాడి చేస్తున్న వీడియోగా షేర్ చేస్తున్నారు. వీడియోలోని మొదటి మరియు చివరి భాగం పంజాబ్, హర్యానా రాష్ట్రానికి సంబంధించినవి, వాటికి బెంగాల్ కి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని వీడియోని పరిశీలించినప్పుడు, ఇది మొత్తం మూడు వేరు వేరు వీడియోలను కలిపి ఎడిట్ చేసినట్టుగా తెలుస్తుంది. మొదటి భాగం వీడియో ని స్క్రీన్ షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే, అదే ఘటనకు సంబంధించి ఎక్కువ నిడివి గల వీడియో జులై 13 2017న యూట్యూబ్ లో అప్లోడ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఘటన ఫగ్వారా, పంజాబ్ లో జరిగినట్టు తెలుపుతున్న న్యూస్ ఆర్టికల్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. కావున, బెంగాల్ కి మరియు వీడియో లోని ఘటనకు ఎటువంటి సంబంధం లేదు.

మూడోవ భాగం వీడియో ని కూడా స్క్రీన్ షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే ఘటనకు సంబంధించి NDTV యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఎక్కువ నిడివి గల వీడియో మాకు లభించింది. ఆ సంఘటన  గురుగ్రామ్‌, హర్యానా రాష్ట్రంలో జరిగినట్టు వీడియో లో తెలిపారు. 2019 సంవత్సరం లో ఈ వీడియో అప్లోడ్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ సంఘటనకు సంబంధించిన న్యూస్ ఆర్టికల్ ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియో భాగం హర్యానా రాష్ట్రానికి చెందింది, బెంగాల్ కి దీనికి ఎటువంటి సంబంధం లేదు.

ఈ వీడియో లోని మొదటి మరియు చివరి భాగాల వీడియో ల సమాచారం మాకు లభించినప్పటికీ, రెండొవ భాగానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం దొరకలేదు. కానీ ఇటీవల 02 మే 2021న వెలువడ్డ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరిగినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసినప్పటికీ, ఇలా పోస్టులో తెలిపినట్టు హిందువులు ముస్లింల పై రివెంజ్ తీసుకుంటున్నట్టు ఎవరు రిపోర్ట్ చేయలేదు.

చివరగా, సంబంధం లేని పాత వీడియోలని జత చేసి బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన గొడవల తరువాత, హిందువులు ముస్లింల పై రివెంజ్ తీసుకుంటున్నట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll