Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియోని చూపిస్తూ ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలో రైతులు పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసారంటూ షేర్ చేస్తున్నారు

0

ఢిల్లీలో జరుగుతున్న రైతుల ధర్నాలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేస్తున్నారు, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశవ్యాప్తంగా నిరసన చేస్తున్న నేపధ్యంలో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేస్తున్న రైతులు.

ఫాక్ట్ (నిజం): 2019లో లండన్ లో జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో, కొంతమంది సిక్కులు పాకిస్తాన్ సపోర్టర్ల తో కలిసి ‘ఖలిస్తాన్ జిందాబాద్’ ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేసారు. పోస్టులో షేర్ చేసిన వీడియో ఈ ఘటనకి సంబంధించింది. ఈ వీడియోకి ఇటీవల రైతుల వ్యవసాయ బిల్లులకి సంబంధించి చేస్తున్న నిరసనలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘ANI’ న్యూస్ వెబ్ సైట్ ‘06 జూలై 2019’ నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. 2019లో లండన్ లో జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో కొంతమంది సిక్కులు పాకిస్తాన్ సపోర్టర్ల తో కలిసి స్టేడియంలో ‘ఖలిస్తాన్ జిందాబాద్’ ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేసినట్టు ఈ వీడియో వివరణలో తెలిపారు. ‘29 జూన్ 2019’ నాడు జరిగిన పాకిస్తాన్-ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు ‘ANI’ తమ ఆర్టికల్ లో పేర్కొంది.

యూకే లో జరిగిన మరికొన్ని వరల్డ్ కప్ మ్యాచులలో కూడా కొంతమంది సిక్కులు ఇలాంటి నినాదాలే చేయడంతో, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని స్టేడియం బయటకి పంపించినట్టు కొన్ని ఆర్టికల్స్ రిపోర్ట్ చేసాయి. ఆ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో ఇటివల రైతులు చేస్తున్న నిరసనలకు సంబంధించినది కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, సంబంధం లేని పాత వీడియోని చూపిస్తూ ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలో రైతులు పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసారంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll