Fake News, Telugu
 

సంబంధంలేని పాత వీడియోని పెట్టి, దుబ్బాక ఉపఎన్నికలో ఈవీఎం ట్యాంపరింగ్ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

0

తాజగా నిర్వహించిన దుబ్బాక ఉపఎన్నికలో జరిగిన ఈవీఎం ట్యాంపరింగ్ కి సంబంధించిన వీడియో అని చెప్తూ, ఒక వీడియోని కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: దుబ్బాక ఉపఎన్నికలో జరిగిన ఈవీఎం ట్యాంపరింగ్ కి సంబంధించిన వీడియో.

ఫాక్ట్: పోస్ట్ లోని వీడియో పాతది. వీడియోకీ, తాజగా దుబ్బాకలో నిర్వహించిన ఉపఎన్నిక కు ఎటువంటి సంబంధంలేదు. ఆ వీడియో కనీసం మే 2019 నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతున్నది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ వీడియో కనీసం మే 2019 నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతున్నట్టు తెలుస్తుంది. పాత పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. పోస్టులోని వీడియోకీ, తాజగా దుబ్బాకలో నిర్వహించిన ఉపఎన్నిక కు ఎటువంటి సంబంధంలేదు.

అంతేకాదు, వీడియోలోని ఈవీఎం పై దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థుల పేర్లు లేనట్టు చూడవొచ్చు. దుబ్బాక ఉప ఎన్నికలో ఈవీఎం పై మూడో స్థానంలో టీఆర్ఎస్ పార్టీ గుర్తు మరియు అభ్యర్థి పేరు ఉండాలి. కానీ, వీడియోలోని ఈవీఎం పై మూడో స్థానంలో బీజేపీ గుర్తు ఉన్నట్టు చూడవొచ్చు. కావున, వీడియోలోని ఈవీఎం దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించింది కాదు. పోస్టులోని వీడియోకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియలేదు. అయితే, వీడియోలో ఈవీఎం పై రెండు వేళ్ళు, రెండు బటన్ల పై పెట్టినట్టు గమనించవచ్చు. 

చివరగా, సంబంధంలేని పాత వీడియోని పెట్టి, ‘దుబ్బాక ఉపఎన్నికలో ఈవీఎం ట్యాంపరింగ్’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll