Fake News, Telugu
 

సంబంధంలేని పాత ఫోటోలను పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండ్ చేసిన IAF విమానాల వంటూ షేర్ చేస్తున్నారు

0

ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేని ప్రధాని మోదీ ఈ రోజు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐతే ఈ రహదారిని ప్రధాని మంగళవారం ప్రారంభించన నేపథ్యంలో ఈ హైవేపై భారత వాయుసేన విమానాలు దిగాయని చెప్తూ కొన్ని ఫోటోలు షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ ఫోటోలకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై దిగిన భారత వాయుసేన విమానాల ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై భారత వైమానిక దళం యుద్ద విమానాలు ల్యాండ్ చేసిన మాట నిజమైనప్పటికి, ఈ ఫోటోలలో ఒక్కటి కూడా ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండ్ చేసిన విమానాలకు సంబంధించినవి కావు. కొన్ని NATO బలగాలు 1984లో జర్మనీలో తమ విమానాలు ల్యాండ్ చేసిన సందర్భంలో తీసినవి కాగా, మరికొన్ని అమెరికా వైమానిక దళానికి చెందిన పైలట్లు ఎమర్జెన్సీ లాండింగ్ చేసినప్పుడు తీసినవి. ఈ ఫొటోలకి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేకి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఫోటో 1, 2, 3 & 4:

ఈ ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇవే ఫోటోలను ప్రచురించిన కొన్ని పాత వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం ఫోటోలలో ఉన్నది హెర్క్యులస్ C130 మరియు A-10 థండర్‌బోల్ట్ II విమానాలు. 1984లో జర్మనీలోని ఆటోబాన్‌ (అమెరికా కంట్రోల్‌లోని యాక్సెస్ హైవే సిస్టమ్) పై ఈ విమానం దిగిన సందర్భంలో ఈ ఫోటోలు తీసారు. అలాగే పోస్టులో ఉన్న ఆ ట్రాక్ ఫోటో, నిజానికి జర్మనీలోని A29 ఆటోబాన్ ఎయిర్‌ఫీల్డ్.

ఇవే ఫోటోలను గతంలో అనేక వార్తా కథనాలు జర్మనీలో ఆటోబాన్‌లోని వంటూ ప్రచురించాయి. అలాంటి కొన్ని వార్తా కథనాలను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడొచ్చు. 1984లో NATO బలగాలు నిర్వహించిన యుద్ద విన్యాసాల సందర్భంలో ఈ ఫోటోలు తీసారు. దీనికి సంబంధించిన వీడియో ఇక్కడ చూడొచ్చు.

ఫోటో 5:

ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని 2018లో ప్రచురించిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం 2016లో NATO దళాలు ఎస్టోనియాలో ఒక రహదారిపై A-10 విమానాలు  టేకాఫ్ మరియు ల్యాండ్ సందర్భంలో తీసినవి ఈ ఫోటోలు. ఈ కథనంలో ఆ ఘటనకి సంబంధించిన వీడియో కూడా చూడొచ్చు.

ఇదే ఫోటోని  పైన తెలిపిన వివరణతో  ప్రచురించిన మరొక వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు. ఐతే ఈ ఫోటో గురించి వెరిఫై చేయలేకపోయినప్పటికీ, ఈ ఫోటో ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి ఈ ఫోటోకి  పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టమవుతుంది.

 ఫోటో 6:

 ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని ఏప్రిల్ 2020లో ప్రచురించిన కొన్ని ఆన్లైన్ వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం ఫోటోలో ఉన్నది అమెరికాకు చెందిన A-10చ యుద్ద విమానం, మూడీ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో మూడీ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ల్యాండ్ చేసినప్పుడు తీసింది ఈ ఫోటో.

ఇదే ఫోటోని  పైన తెలిపిన వివరణతో  ప్రచురించిన మరొక వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు. ఐతే ఈ ఫోటో గురించి వెరిఫై చేయలేకపోయినప్పటికీ, ఈ ఫోటో ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి ఈ ఫోటోకి  పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టమవుతుంది.

ఫోటో 7:

ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని ఏప్రిల్ 2020లో ప్రచురించిన పలు ఆన్లైన్ వార్తా కథనం మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం 2017లో అమెరికా, మిచిగాన్ ఎయిర్ నేషనల్ గార్డ్‌కి చెందిన A-10 పైలట్ కాక్పిట్‌లో లోపం కారణంగా తన విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసినప్పుడు తీసింది ఈ ఫోటో.

ఇదే ఫోటోని  పైన తెలిపిన వివరణతో  ప్రచురించిన మరొక వార్తా కథనం ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

కొత్తగా నిర్మించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై భారత వైమానిక దళం యొక్క యుద్ద విమానాలు నిన్న (15 నవంబర్ 2021) ల్యాండ్ అయినట్టు వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. దీన్నిబట్టి IAF విమానాలు ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండ్ అయిన మాట నిజమైనప్పటికి పోస్టులో షేర్ చేసిన ఫోటోలు మాత్రం నిన్నటి ఘటనకి సంబంధించినవి కావని స్పష్టంగా తెలుస్తుంది.

చివరగా, సంబంధంలేని పాత ఫోటోలను పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండ్ చేసిన IAF విమానాల వంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll