Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియోని టీ20 వరల్డ్‌ కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయినందుకు బలూచిస్తాన్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు

0

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోవడాన్ని బలూచిస్తాన్ ప్రజలు ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. కొంత మంది ఆనందంతో చిందులేస్తున్న దృశ్యాలని ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఈ వీడియోని ఇదే క్లెయింతో పలు ప్రముఖ న్యూస్ సంస్థలు ఆర్టికల్స్ మరియు వీడియోలని పబ్లిష్ చేసాయి. 11 నవంబర్ 2021 నాడు జరిగిన టీ 20 వరల్డ్ కప్ సెమిఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో, ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 వరల్డ్ కప్ సెమిఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయినందుకు బలూచిస్తాన్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో కనీసం 2020 జూన్ నెల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ వీడియో ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీ 20 వరల్డ్ కప్ సెమిఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తరువాత తీసినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Eagle Mountain’ అనే యూట్యూబ్ ఛానల్ 09 జూన్ 2020 నాడు షేర్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియో టైటిల్‌లోని ఉర్దూ అక్షరాలని అనువదించి చూస్తే, “పాకిస్తాన్ వెర్రి నృత్యాలు” అని తెలిపినట్టు తెలిసింది. 2020లో ఈ వీడియోని మరికొందరు యూట్యూబ్ యూసర్లు షేర్ చేస్తూ, బలూచిస్తాన్ ప్రజల నాట్య దృశ్యాలని తెలిపారు. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీసారో స్పష్టంగా తెలియనప్పటికీ, ఈ వీడియోని ఇటీవల టీ 20 వరల్డ్ కప్ సెమిఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి తరువాత తీయలేదని ఈ వివరాల ఆధారంగా స్పష్టమవుతుంది.

11 నవంబర్ 2021 నాడు ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 వరల్డ్ కప్ సెమిఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయిన తరువాత  బలూచిస్తాన్ ప్రజలు వీధులలో వేడుకలు చేసుకున్నట్టు ‘ANI’ వార్తా సంస్థ 12 నవంబర్ 2021 నాడు ఆర్టికల్‌లో పబ్లిష్ చేసింది. కాని, పోస్టులో షేర్ చేసిన వీడియోకి బలూచిస్తాన్ వేడుకలకి ఎటువంటి సంబంధం లేదు.

చివరగా, సంబంధం లేని పాత వీడియోని ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 వరల్డ్ కప్ సెమిఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయినందుకు బలూచిస్తాన్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll