Fake News, Telugu
 

సంబంధంలేని పాత ఫోటోను ఇటీవల ఒక మహిళ ఏనుగుకు జన్మనిచ్చిందంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు

0

మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని మునిమోక్షం దగ్గర ఒక మహిళ ఏనుగుకు జన్మనిచ్చిందని ఒక ఫోటోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని మునిమోక్షం దగ్గర ఒక మహిళ ఏనుగుకు జన్మనిచ్చిన ఫోటో.

ఫాక్ట్: ఫోటో కనీసం 2009 నుండే ఇంటర్నెట్‌లో వివిధ క్లెయిమ్స్ తో షేర్ అవుతుంది. SNOPES వారు ఈ ఫోటో గర్భస్రావం చేయబడిన, లేదా, బహుశా మరణించిన తల్లి ఏనుగు నుండి తీసిన చనిపోయిన ఏనుగు పిండం అని తెలిపారు. ఒక మనిషికి ఏనుగు పుట్టడం అనేది ప్రస్తుతం ఉన్న వైద్య శాస్త్రం ద్వారా సాధ్యమైన పని కాదు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని మునిమోక్షం దగ్గర ఒక మహిళ ఏనుగుకు జన్మనిచ్చిందని ఎక్కడా కూడా రిపోర్ట్ అవలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.   

ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే ఫోటో కనీసం 2009 నుండి ఇంటర్నెట్‌లో వివిధ క్లెయిమ్స్ తో షేర్ అవుతుంది. ప్రపంచంలోనే అతి చిన్న ఏనుగు అని కొందరు, ఒక నెల వయస్సుతో ఉన్న ఏనుగు అంటూ కొందరు షేర్ చేసారు. అప్పట్లో, SNOPES వారు ఒక ఫాక్ట్ చెక్ ఆర్టికల్ రాసి, ఈ ఫోటో ఒక చనిపోయిన ఏనుగు పిండం (foetus) అని తేల్చిచెప్పారు. గర్భస్రావం చేయబడిన లేదా, బహుశా మరణించిన తల్లి ఏనుగు నుండి తీసిన చనిపోయిన ఏనుగు పిండం అని తెలిపారు. కానీ, ఫోటో యొక్క ఒరిజినల్ సోర్స్ మాకు లభించలేదు. అయితే ఈ ఫోటో పాతదని నిర్దారించొచ్చు, ఇటీవల తీసింధైతే కాదు.

ఏనుగు తల్లి సుమారు 22 నెలల పాటు పిండాన్ని మోస్తుంది. తల్లి జన్మనిచ్చినప్పుడు, ఏనుగు దూడ సుమారు 110 కిలోల బరువుంటుంది. ఫోటోలో చూపించినట్టు నిజంగానే అది అప్పుడే పుట్టిన దూడ అయ్యుంటే, అంత చిన్నగా పుట్టి ఉండేదికాదు. అయినా, ఒక మనిషికి ఏనుగు పుట్టడం అనేది ప్రస్తుతం ఉన్న వైద్య శాస్త్రం ద్వారా సాధ్యమైన పని కాదు. అలాంటివి జరిగినట్టుగా కూడా ఎక్కడా రిపోర్ట్ అవలేదు.

ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని మునిమోక్షం దగ్గర ఒక మహిళ ఏనుగుకు జన్మనిచ్చిందని కూడా ఎక్కడా కూడా రిపోర్ట్ అవలేదు.

చివరగా, సంబంధంలేని పాత ఫోటోను ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలో మునిమోక్షం దగ్గర ఒక మహిళ ఏనుగుకు జన్మనిచ్చిందంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll