Fake News, Telugu
 

రైతుల ఆందోళనల్లో రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ కి గాయమైందని చెప్తూ సంబంధంలేని ఫోటోని షేర్ చేస్తున్నారు.

0

ఆర్మీ యూనిఫాంలో ఉన్న ఒక వ్యక్తి ఫోటో మరియు కంటికి కట్టు కట్టుకున్న ఇంకొక వ్యక్తి ఫోటో  కలిసిన ఒక కొల్లాజ్ ని షేర్ చేస్తూ రెండు ఫోటోల్లో ఉన్నది రిటైర్ అయిన ఆర్మీ కెప్టెన్ పి.పి.స్ ధిల్లాన్ అని, వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోనల్లో అతని కంటికి గాయమైందని చేప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రిటైర్ అయిన ఆర్మీ కెప్టెన్ పి.పి.ఎస్ ధిల్లాన్ కి వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోనల్లో కంటికి గాయమైంది.

ఫాక్ట్(నిజం): ఆ రెండు ఫోటోల్లో ఉన్నది ఒక్కరు కాదు. ఆర్మీ యూనిఫాంలో ఉన్నది రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ పి.పి.ఎస్ ధిల్లాన్. ఈయన పుట్టిన రోజున ఈ ఫోటోని ఇతని కుమారుడు ఫేస్బుక్ లో షేర్ చేసాడు. మేము ఇతని కుమారుడిని సంప్రదించినప్పుడు ఫోటోలో కంటికి కట్టు కట్టుకొని ఉన్న వ్యక్తి తన తండ్రి కాదని చెప్పాడు. ఇంకా తన తండ్రికి ఇప్పుడు జరుగుతున్న రైతుల నిరసనలకి ఎటువంటి సంబంధంలేదని చెప్పాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని ఒక వ్యక్తి ఫేస్బుక్ లో షేర్ చేసిన పోస్ట్ ఒకటి మాకు కనిపించింది. ఈ పోస్ట్ ప్రకారం ఈ ఫోటోలో ఉన్నది రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ పి.పి.ఎస్ ధిల్లాన్ అని, ఈ ఫోటోని ధిల్లాన్ పుట్టిన రోజు సందర్బంగా ఇతని కుమారుడు ఫేస్బుక్ లో షేర్ చేసాడు. పి.పి.ఎస్ ధిల్లాన్ కి సంబంధించి మరొక ఫోటో తన కుమారుడు తన ఫేస్బుక్ ఎకౌంటులో షేర్ చేసాడు, దినిని ఇక్కడ చూడొచ్చు.

మేము ఇతని కుమారుడిని సంప్రదించినప్పుడు ఈ ఫోటోల్లో ఆర్మీ యూనిఫాంలో ఉన్నది తన తండ్రి రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ పి.పి.ఎస్ ధిల్లాన్ అని తెలిపాడు. కంటికి కట్టు కట్టుకున్న వ్యక్తి తన తండ్రి కాదని స్పష్టం చేసాడు. పైగా తన తండ్రికి ఇప్పుడు జరుగుతున్న రైతుల నిరసనలకు ఎటువంటి సంబంధంలేదని చెప్పాడు. దీన్నిబట్టి రెండు ఫోటోల్లో ఉన్నది ఊకే వ్యక్తి కాదని చెప్పొచ్చు.

కంటికి కట్టు కట్టుకున్న వ్యక్తి ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఫోటోని ఇప్పుడు జరుతున్న రైతుల నిరసనల నేపధ్యంలో షేర్ చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు మాకు కనిపించాయి, వీటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే, ఈ వ్యక్తి గురించి మరింత సమాచరం ఏది మాకు లభించలేదు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.  

చివరగా, రైతుల ఆందోళనల్లో రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ కి గాయమైందని చెప్తూ సంబంధంలేని ఫోటోని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll