Fake News, Telugu
 

నిరాజ్ చోప్రాని అభినందిస్తూ ఈ ట్వీట్ చేసింది పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ పేరుతో ఉన్న ఒక ఫేక్ అకౌంట్

0

‘టోక్యో ఒలింపిక్స్ 2020’ జావెలిన్ త్రో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రాని పాకిస్తాన్ అథ్లెట్, జావెలిన్ త్రో లో పాల్గొన్న అర్షద్ నదీమ్ అభినందిస్తూ పెట్టిన ట్వీట్, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఈ ట్వీట్లో అర్షద్ నదీమ్, “Congratulations to my Idol Neeraj Chopra for winning Gold medal. Sorry Pakistan, I could not win for you.” (తెలుగు అనువాదం: నా ఐడల్ నీరజ్ చోప్రాకు అభినందనలు. నేను గెలవలేకపోయాను, నన్ను క్షమించండి పాకిస్తాన్), అని రాసాడు. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ‘టోక్యో ఒలింపిక్స్ 2020’లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రాని అభినందిస్తూ పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ పెట్టిన ట్వీట్ యొక్క ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ట్వీట్‌ని పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ పెట్టలేదు. అర్షద్ నదీమ్ పేరుతో రూపొందించిన ఒక ఫేక్ ట్విట్టర్ అకౌంట్ ఈ ట్వీట్‌ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పేరడీ అకౌంట్ ట్వీట్‌కు సంబంధించి పలు న్యూస్ సంస్థలు రిపోర్ట్ చేసాయి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ట్వీట్‌ కోసం ‘@ArshadNadeemPak’ అనే యూసర్ IDతో ఉన్న ట్విట్టర్ అకౌంట్లో వెతకగా, ఈ ట్విట్టర్ అకౌంట్ పోస్టులో షేర్ చేసిన ట్వీట్‌ని డిలీట్ చేసినట్టు తెలిసింది. అర్షద్ నదీమ్ పేరుతో రుపొందించిన ఈ ట్విట్టర్ అకౌంట్ ఇంటెరాక్షన్స్‌లో వెతకగా, ఈ ట్విట్టర్ అకౌంట్ పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ కు సంబంధించింది కాదని తెలిసింది. నీరజ్ చోప్రాను అభినందిస్తూ పెట్టిన ఈ ట్వీట్‌ను అర్షద్ నదీమ్ పేరుతో రూపొందించిన ఒక ఫేక్ ట్విట్టర్ అకౌంట్ పెట్టినట్టు ‘Live Law India’ లీగల్ కరెస్పాండంట్ స్పర్ష ఉపాధ్యాయ్ ఒక ట్వీట్ సమాధానంలో తెలిపారు. అంతేకాదు, ఈ ట్విట్టర్ అకౌంట్‌ని క్రికెటర్ ‘సయ్యిద్ అన్వర్’ పేరుతో ఇదివరకు నడిపినట్టు ఉపాధ్యాయ్ తన ట్వీట్లో తెలిపారు. ఇదే విషయాన్నీ తెలుపుతూ మరొక ట్విట్టర్ యూసర్ కూడా ట్వీట్ పెట్టారు. Saeed Anwar (@CSS_25) పేరుతో ఈ ట్విట్టర్ అకౌంట్ ఇదివరకు నడిపినట్టు ఈ యూసర్ తన ట్వీట్లో తెలిపారు.

ఈ వివరాల ఆధారంగా ఆ ట్విట్టర్ ప్రొఫైల్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం ‘@CSS_25’ కీ పదాలు వాడి ట్విట్టర్లో వెతికితే, ‘@ArshadNadeemPak’ ట్విట్టర్ IDని ట్యాగ్ చేస్తూ పెట్టిన ఒక ట్వీట్ దొరికింది. అంతేకాదు,  @CSS_25 యూసర్ IDతో నడిపిన పాత ట్విట్టర్ అకౌంట్ గూగుల్ కాష్ లో లభించింది. ‘సయ్యిద్ అన్వర్’ పేరుతో ఉన్న ఈ అకౌంటు ట్విట్టర్ ID, పోస్టులో షేర్ చేసిన ‘@ArshadNadeemPak’ ట్విట్టర్ ID ఒకటే అని ‘TweeterID’ టూల్ ద్వార తెలుసుకున్నాము. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ట్వీట్‌ని పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ పేరుతో రూపొందించిన ఒక ఫేక్ ట్విట్టర్ అకౌంటు పెట్టినట్టు ఖచ్చితంగా చెప్పవచ్చు.

సోషల్ మీడియాల్ వైరల్ అవుతున్న ఈ ఫేక్ ట్వీట్‌ గురించి స్పష్టతనిస్తూ పలు న్యూస్ సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఆ అర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, నిరాజ్ చోప్రాని అభినందిస్తూ ఈ ట్వీట్ చేసింది పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ పేరుతో రుపొంచించిన ఫేక్ అకౌంట్.

Share.

About Author

Comments are closed.

scroll