Fake News, Telugu
 

రాఖీ కట్టిన తర్వాత డబ్బులు ఇవ్వలేదని అన్నపై చెల్లెలు దాడి చేసినట్లు చెప్తున్న ఈ TV9 న్యూస్ క్లిప్ ఫేక్

0

“రాఖీ కట్టిన తరువాత డబ్బులు ఇవ్వలేదని అన్న తలపై రాడ్డుతో కొట్టిన చెల్లెలు కోమాలోకి వెళ్లిన అన్న” అని చెప్తున్న ‘TV9’ తెలుగు న్యూస్ ఛానల్ యొక్క బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: “రాఖీ కట్టిన తరువాత డబ్బులు ఇవ్వలేదని అన్న తలపై రాడ్డుతో కొట్టిన చెల్లెలు కోమాలోకి వెళ్లిన అన్న” -‘TV9’ న్యూస్ ఛానల్ పబ్లిష్ చేసిన వార్త కథనం.

ఫాక్ట్(నిజం): ఈ వార్తను ‘TV9 Telugu’ న్యూస్ ఛానల్ పబ్లిష్ చేయలేదు. అలాగే, ఇటీవల ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగినట్లు చెప్పే ఎటువంటి రిపోర్ట్స్ కూడా లేవు . వైరల్ పోస్టులో ఉన్న ఫోటోను 13 జూలై 2022న షట్టర్‌స్టాక్ (shutterstock) అనే స్టాక్ ఇమేజ్ వెబ్సైట్లో టోంగ్‌పూల్ పియాసుపున్ (Tongpool Piasupun) అనే థాయిలాండ్ కు చెందిన ఫోటోగ్రాఫర్ అప్లోడ్ చేశాడు. ఈ ఫొటోలో ఆసుపత్రి బెడ్ పై ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని ఉన్న వ్యక్తి ఒక మోడల్. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా, పోస్టులో తెలుపుతున్నట్టు రాఖీ కట్టిన తరువాత డబ్బులు ఇవ్వలేదని అన్నపై చెల్లెలు దాడి చేసినట్లు ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికగా, ఇటీవల  ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగినట్లు చెప్పే ఎటువంటి రిపోర్ట్స్ మాకు లభించలేదు. ఈ వార్త నిజమై ఉంటే ఉంటే పలు మీడియా సంస్థలు కచ్చితంగా రిపోర్టు చేసి ఉండేవి. అలాగే, TV9 సంస్థ యొక్క వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్ మరియు సోషల్ మీడియా అకౌంట్స్ ను (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) పరిశీలించగా,ఈ వార్తను ‘TV9 Telugu’ న్యూస్ ఛానల్ కూడా పబ్లిష్ చేయలేదని తెలిసింది.

ఇకపోతే వైరల్ పోస్టులో ఉన్న ఫోటోకు సంబంధించిన సమాచారం కోసం, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, ఇదే ఫొటోను 13 జూలై 2022న షట్టర్‌స్టాక్ (shutterstock) అనే స్టాక్ ఇమేజ్ వెబ్సైట్లో టోంగ్‌పూల్ పియాసుపున్ (Tongpool Piasupun) అనే థాయిలాండ్ కు చెందిన ఫోటోగ్రాఫర్ అప్లోడ్ చేసినట్లు కనుగొన్నాము. 

ఈ వెబ్సైట్లో ఉన్న ఫోటోలను జాగ్రత్తగా పరిశీలించగా, ఈ ఫొటోలో ఆసుపత్రి బెడ్ పై ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని ఉన్న వ్యక్తి ఒక మోడల్ అని తెలిసింది (ఇక్కడ). దీన్న బట్టి సంబంధంలేని ఫోటోను ఉపయోగిస్తూ,  ‘TV9 Telugu’ న్యూస్ ఛానల్ యొక్క బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్ ను ఎడిట్ చేసి పోస్టులో షేర్ చేసిన ఫోటోని రూపొందించారని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, రాఖీ కట్టిన తరువాత డబ్బులు ఇవ్వలేదని అన్నపై చెల్లెలు దాడి చేసినట్లు చెప్తున్న ఈ TV9 న్యూస్ క్లిప్ ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll