నింగి లోకి ఎగరడానికి సిద్ధంగా ఉన్న హెలికాప్టర్ ని ఒక లారీ ఢీకొట్టిన వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, ఆ ఘటన మన భారత దేశం లో జరిగిందని చెప్తున్నారు. పోస్ట్ లో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: భారత దేశం లో ఒక లారీ హెలికాప్టర్ ని ఢీకొట్టిన ఘటన వీడియో.
ఫాక్ట్ (నిజం): వీడియోలో ఒక లారీ హెలికాప్టర్ ని ఢీకొట్టిన ఘటన జరిగింది బ్రెజిల్ లో, భారత్ లో కాదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే వీడియో తో ఉన్న బ్రెజిలియన్ వెబ్సైట్ల కథనాలు సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చాయి. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఆ కథనాల్లో వీడియోలోని ఘటన బ్రెజిల్ లోని ‘రియో బ్రాంకో’ లో జరిగినట్లుగా ఉంది.
పైన లభించిన సమాచారంతో మేము గూగుల్ లో కీవర్డ్స్ తో వెతికినప్పుడు, ‘Daily Mail’ వారి కథనం లభించింది. ఆ కథనం లో కూడా వీడియోలోని ఘటన బ్రెజిల్ లోని ‘రియో బ్రాంకో’ లో జరిగిందని ఉంది.
చివరిగా, వీడియోలో ఒక లారీ హెలికాప్టర్ ని ఢీకొట్టిన ఘటన జరిగింది బ్రెజిల్ లో, భారత్ లో కాదు.