Fake News, Telugu
 

‘ThromboBliss’ మందులు రెండు రోజుల్లోనే డెంగ్యూ వ్యాధిని నయం చేయవు, 72 గంటల్లో ప్లేట్లేట్లను మాత్రం పెంచుతాయి.

1

డెంగ్యూ జ్వరం ని నివారించే ఔషధం దొరికేసింది అని చెప్తూ, ‘ThromboBliss’ అనే టాబ్లెట్స్ మరియు సిరప్ వాడితే రెండు రోజుల్లోనే డెంగ్యూ వచ్చిన వారు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘ThromboBliss’ మందులు వాడితే రెండు రోజుల్లో డెంగ్యూ తగ్గిపోతుంది.

ఫాక్ట్ (నిజం): ‘ThromboBliss’ మందు పై జరిగిన క్లినికల్ ట్రయల్స్ లో ఆ మందు వాడడం వల్ల 72 గంటల తర్వాత ప్లేట్లేట్ కౌంటు బాగా పెరిగినట్టు తెలిసింది. ‘ThromboBliss’ మందు డైరెక్ట్ గా డెంగ్యూ వ్యాధిని నయం చేయదు, డెంగ్యూ వ్యాధి వల్ల కలిగే ‘Thrombocytopenia’ (ప్లేట్లెట్స్ 1,00,000/cu.mm. కంటే తగ్గడం) అనే కండీషన్ ని నయం చేస్తుంది. కావున పోస్ట్ లో రెండు రోజుల్లోనే డెంగ్యూ తగ్గిపోతదని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

‘ThromboBliss’ మందుల గురించి ఆ కంపెనీ వెబ్ సైట్ లో వెతకగా, డెంగ్యూ వ్యాధి వచ్చిన వారకి రక్తంలో ప్లేట్లెట్స్ పెరగడానికి ఆ మందు వాడవచ్చని తెలుస్తుంది. కానీ, రెండు రోజుల్లోనే డెంగ్యూ వ్యాధి తగ్గిపోతుందని వారి వెబ్ సైట్ లో ఎక్కడా కూడా రాసి లేదు. ప్లేట్లేట్ కౌంటు కూడా 72 గంటల్లో (3 రోజుల్లో) పెరుగుతాయని రాసి ఉంటుంది.

‘ThromboBliss’ మందు పై జరిగిన క్లినికల్ ట్రయల్స్ లో కూడా ఆ మందు వాడడం వల్ల 72 గంటల తర్వాత ప్లేట్లేట్ కౌంటు బాగా పెరిగినట్టు తెలిసింది. ఆ క్లినికల్ ట్రయల్స్ రిపోర్ట్ ని ఇక్కడ చదవొచ్చు. ‘Carica Papaya’ ఆకు రసం తో చేసిన మందులు వాడటం వల్ల మూడో రోజుకు తగినంత ప్లేట్లెట్స్ పెరిగినట్టు రాసిన రీసెర్చ్ ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు. ‘ThromboBliss’ మందు డైరెక్ట్ గా డెంగ్యూ వ్యాధిని నయం చేయదు, డెంగ్యూ వ్యాధి వల్ల కలిగే ‘Thrombocytopenia’ (ప్లేట్లెట్స్ 1,00,000/cu.mm. కంటే తగ్గడం) అనే కండీషన్ ని నయం చేస్తుంది.

డెంగ్యూ వ్యాధికి ఎటువంటి నిర్దిష్టమైన మందులు లేవు. కేవలం డెంగ్యూ వల్ల కలిగే వివిధ కండిషన్లకు డాక్టర్లు మందులు ఇస్తారు. ఇదే విషయాన్ని అన్ని ప్రముఖ హాస్పిటల్స్ (ఫోర్టిస్, అపోలో, యశోదా) మరియు సీడీసీ (అమెరికా) వాళ్ళ వెబ్ సైట్లలో పెట్టినట్టు చూడవొచ్చు.

డెంగ్యూ వ్యాధి (Febrile phase) కనీసం 2 నుండి 7 రోజుల వరకు ఉంటుదని భారత్ ప్రభుత్వం మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ రిలీజ్ చేసిన రిపోర్ట్లలో చూడవొచ్చు. డెంగ్యూ వ్యాధి పై ప్రజలకు ఉన్న ప్రశ్నలకు సమాధానమిస్తూ ఢిల్లీ ప్రభుత్వం రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ని ఇక్కడ చదవొచ్చు.

చివరగా, ‘ThromboBliss’ మందులు రెండు రోజుల్లోనే డెంగ్యూ వ్యాధిని నయం చేయవు, 72 గంటల్లో ప్లేట్లేట్లను మాత్రం పెంచుతాయి.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll