Fake News, Telugu
 

ఈ వైరల్ ఫోటోలలో ఉన్న వాళ్ళు షాజహాన్, ముంతాజ్ మహల్ కాదు.

0

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్ మహల్ కట్టించిన మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి షాజహాన్, తన భార్య ముంతాజ్ యొక్క అసలు ఫోటోలు అని చూపుతున్న గ్రాఫిక్ (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వారిద్దరివి రెండు వేరు వేరు చిత్రపటాలు ఉన్నాయి. ఊహాజనిత ప్రచార చిత్రం అని వాళ్ళు కలిసి ఉన్న చిత్రం ఒకటి కూడా షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్:  షాజహాన్, ముంతాజ్ మహల్ యొక్క అసలు ఫోటోలను ఈ వైరల్ గ్రాఫిక్ చూపిస్తుంది. 

ఫ్యాక్ట్:  ఇందులో షాజహాన్ అని చెప్తున్న వ్యక్తి నిజానికి మొఘల్ సామ్రాజ్యం యొక్క చక్రవర్తి ‘షాజహాన్ 2”. తాజ్ మహల్ నిర్మించిన 5వ చక్రవర్తి ‘షాజహాన్ 1’ కాదు. అలాగే షా జహాన్ 1 భార్య ముంతాజ్ మహల్ అని చెప్తున్న వ్యక్తి నిజానికి భోపాల్ రాజ్యం యొక్క బేగం ‘సుల్తాన్ షా జహాన్ బేగం.’ కాబట్టి, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

వైరల్ ఫోటోల వెనుక ఉన్న అసలు నిజాలు పరిశీలించడానికి, ముందుగా మేము వాటిని ఇంటర్నెట్లో విడి విడిగా రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికాము. దీనిమూలంగా, ఈ ఫోటోలు షాజహాన్ మరియు ముంతాజ్ మహల్‌వి కావు అని మాకు తెలిసింది. 

ముందుగా, షాజహాన్ (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) అని చెప్తున్న ఫోటో మొఘల్ చక్రవర్తి షాజహాన్ 2కి చెందింది. ఈ ఫోటో మాకు స్టాక్ ఇమేజ్ వెబ్సైటు ‘alamy’ లో మరియు హిస్టారికల్ ఫోటోలని లైసెన్స్ చేసే సంస్థ ‘bridgeman images’లో దొరికింది. ఇదే ఫోటో మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

ఇక షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ ఫోటో అని చెప్తున్న ఫోటో, నిజానికి భోపాల్ రాజ్యానికి చెందిన మూడవ బేగం (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ‘షాజహాన్ బేగం.’ షాజహాన్ బేగం పుట్టే సమయానికి ముంతాజ్ మహల్ మరణించి 200 సంవత్సరాలు పైనే అయ్యింది. 

గతంలో కూడా ఇదే ఫోటోని ముంతాజ్ మహల్ ఫోటో అని సోషల్ మీడియా యూజర్లు షేర్ చేసినప్పుడు Factly ఆ క్లెయిమ్ తప్పు అని ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది

చివరిగా, సంబంధం లేని ఫోటోలని మొఘల్ చక్రవర్తి షాజహాన్, తన భార్య ముంతాజ్ మహల్ యొక్క ఫోటోలు అని తప్పుగా షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll