Fake News, Telugu
 

2024 ఎన్నికల్లో టీడీపీకి గెలిచే ఛాన్స్ లేదని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నట్టు షేర్ చేస్తున్న ఈ ‘Way2News’ వార్తా కథనం ఫేక్

0

చంద్రబాబుతో భేటీ అయిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు అని చెప్తు ‘Way2News’ పబ్లిష్ చేసిన కథనం అని ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీకి గెలిచే ఛాన్స్ లేదని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.

ఫాక్ట్(నిజం): ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో అని ‘Way2News’ సంస్థ X పోస్టు ద్వారా స్పష్టత ఇచ్చింది. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు .

వైరల్ పోస్టులో చెప్పిన విధంగా, చంద్రబాబుతో భేటీ అయిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీకి గెలిచే ఛాన్స్ లేదని పేర్కొన్నారా అని వెతికితే, ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదని తెలిసింది. ఈ వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ (https://way2.co/d3kefa) ద్వారా ‘Way2News’లో వెతికితే ఈ సంస్థ 10 ఆగష్టు 2023న “లిస్ట్‌-A క్రికెట్‌లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్లు” అనే టైటిల్‌తో ప్రచురించిన అసలైన వార్త దొరికింది.

ఈ ప్రశాంత్ కిషోర్ వార్త వైరల్ అవడంతో, Way2News సంస్థ X పోస్ట్ ద్వారా “మా లోగోను ఉపయోగించి కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది మరియు ‘అటాచ్ చేసిన పోస్ట్’ వైరల్‌గా మారింది” అంటూ ఈ వార్త కథనం ఫేక్ అని స్పష్టత ఇచ్చారు.

చివరగా, 2024 ఎన్నికల్లో టీడీపీకి గెలిచే ఛాన్స్ లేదని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నట్టు షేర్ చేస్తున్న ఈ ‘Way2News’ వార్తా కథనం ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll