Fake News, Telugu
 

జగన్ తన గొంతు పట్టుకుని గోడకేసి గుద్దాడు అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించినట్లు రిపోర్ట్ చేసిన ఈ వార్తా కథనం ‘Way2News’ ప్రచురించలేదు.

0

ఇటీవల విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలలో పాల్గొన్న వైఎస్ షర్మిల, ఏపీ ప్రభుత్వం మరియు సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే షర్మిల “తాను 2019 తరువాత ఒక్కసారి తాడేపల్లిలోని జగన్ ఇంటికి వెళ్ళి ఆస్తిలో తన వాటా ఇవ్వమన్నందుకు, జగన్ తన గొంతు పట్టుకుని గోడకేసి గుద్దాడని… దానికి సాక్ష్యం తన తల్లి విజయమ్మే” అని వ్యాఖ్యానించినట్లు చెప్తూ ‘Way2News’ పబ్లిష్ చేసిన కథనం అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం

క్లెయిమ్: “జగన్ ఇంటికి వెళ్ళి ఆస్తిలో తన వాటా ఇవ్వమన్నందుకు, జగన్ తన గొంతు పట్టుకుని గోడకేసి గుద్దాడని… దానికి సాక్ష్యం తన తల్లి విజయమ్మే” అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించినట్లు రిపోర్ట్ చేసిన ‘Way2News’ వార్తా కథనం

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటో ఎడిట్ చేయబడినది. 2023 మార్చి నెలలో ‘Way2News’ పబ్లిష్ చేసిన వార్తా కథనాన్ని మార్ఫ్ చేసి ఈ ఫోటోని రూపొందించారు. వైఎస్ షర్మిల జగన్ పై ఇలాంటి తీవ్ర విమర్శలు చేసినట్టు ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు. 

పోస్టులో తెలుపుతున్నట్టు జగన్ పై వైఎస్ షర్మిల ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అని వెతికితే, తమ కుటుంబం విడిపోవడానికి జగనే కారణం అని వ్యాఖ్యానించినట్లు రిపోర్ట్స్ లభించాయి. అయితే వైఎస్ షర్మిల వైరల్ పోస్టులో తెలుపుతున్న వ్యాఖ్యలు చేసినట్టు ‘Way2News’తో పాటు మరే వార్తా సంస్థ కూడా రిపోర్ట్ చేయలేదని తెలిసింది. ఒకవేళ జగన్ పై వైఎస్ షర్మిల అటువంటి తీవ్ర విమర్శలు చేసివుంటే, ఆ విషయాన్ని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసేవి.

వైరల్ పోస్టులో షేర్ చేసిన వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ (https://way2.co/y2c4tu) ద్వారా ‘Way2News’లో వెతికితే ఈ సంస్థ 21మార్చి 2023న “GK- ప్రముఖ వ్యక్తుల బిరుదులు” అనే టైటిల్‌తో ప్రచురించిన అసలైన వార్త దొరికింది. దీన్ని బట్టి అసలైన ‘Way2News’ కథనాన్ని ఎడిట్ చేస్తూ పోస్టులో షేర్ చేసిన ఫోటోలోని రూపొందించారు అని నిర్థారించవచ్చు.

చివరగా, వైఎస్ జగన్ తన గొంతు పట్టుకుని గోడకేసి గుద్దాడు అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించినట్లు  రిపోర్ట్ చేసిన ఈ వార్తా కథనం Way2News ప్రచురించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll