Fake News, Telugu
 

ఆ వీడియో కశ్మీర్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులది కాదు. అది ఒక పాత 2017 వీడియో

0

కొంతమంది మహిళలు నిరసన చేస్తున్నట్లుగా ఉన్న వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, అది కశ్మీర్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులదని చాలా మంది ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : కశ్మీర్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియో 2017లో కొంతమంది విద్యార్థులు కశ్మీర్ వ్యాలీలో చేసిన నిరసనలకు సంబంధించినది. అది ఈ మధ్య కాలం తీసిన వీడియో కాదు. కావున, పోస్టులో చేసిన ఆరోపణ తప్పు.  

పోస్టులో ఉన్న వీడియో క్లిప్ మీద “RK” అని ఉండడం చూడవచ్చు. RK అనగా ‘Rising Kashmir’, అది జమ్మూ-కశ్మీర్ రాష్ట్రం ఆధారిత వార్తలు ప్రచురించే ఒక వార్తా సంస్థ. ఆ వార్తా సంస్థ యూట్యూబ్ ఛానెల్ లో ‘Kashmir Protests’ అనే కీవర్డ్స్ తో వెతికినప్పుడు, అదే క్లిప్ కి సంబంధించిన పూర్తి వీడియో సెర్చ్ రిజల్ట్స్ లో లభిస్తుంది. ఆ వీడియో కొంతమంది కశ్మీర్ విద్యార్థులు చేపట్టిన నిరసనలకు సంబంధించినదని దాని టైటిల్ ద్వారా తెలుస్తోంది. కానీ, ఆ వీడియో యొక్క టైం స్టాంప్ చూసినట్లయితే, దానిని యూట్యూబ్ లో ఏప్రిల్ 17, 2017న అప్లోడ్ చేసినట్లుగా తెలుస్తుంది. కావున అది ఈ మధ్య కాలంలో తీసిన వీడియో కాదు.

చివరగా, ఆ వీడియో కశ్మీర్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులది కాదు. అది ఒక పాత వీడియో.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll