పవన్ కళ్యాణ్‌తో రెండు రోజుల చర్చల అనంతరం జనసేనకు 64 సీట్ల ఇవ్వడానికి, టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్‌కు రెండేళ్లు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించినట్లు చెప్తున్న ‘Way2News’ పబ్లిష్ చేసిన కథనమంటూ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: రాబోయే 2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా జనసేనకు 64 సీట్ల ఇవ్వడానికి, కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్‌కు రెండేళ్లు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి చంద్రబాబు అంగీకారం – ‘Way2News’ వార్తా కథనం.
ఫాక్ట్(నిజం): వైరల్ పోస్టులో చెప్పినట్లు టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా జనసేనకు 64 సీట్ల ఇవ్వడానికి, అధికారంలోకి వస్తే రెండేళ్లు ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్‌కు ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారు అని తెలిపే ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు. అంతేకాకుండా,ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో అని ‘Way2News’ సంస్థ X పోస్టు ద్వారా స్పష్టత ఇచ్చింది. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు .
ముందుగా వైరల్ పోస్టులో తెలుపుతున్నట్టు టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా జనసేనకు 64 సీట్ల ఇవ్వడానికి, రెండేళ్లు ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్‌కు ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారా అని వెతకగా, మాకు ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు. అంతేకాకుండా, ఈ క్రమంలోనే ఈ వార్తను Way2News సంస్థ కూడా ప్రచురించలేదు అని తెలిసింది. వైరల్ పోస్టులో షేర్ చేసిన వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ (https://way2.co/x4n7yk ) ద్వారా ‘Way2News’లో వెతికితే “ప్రతిపక్షం బలపడలేదు. అధికార పార్టీకి తిరుగులేదు: సీఎం జగన్” అనే టైటిల్‌తో ప్రచురించిన అసలైన వార్త దొరికింది. దీన్ని బట్టి అసలైన ‘Way2News’ కథనాన్ని ఎడిట్ చేస్తూ పోస్టులో షేర్ చేసిన ఫోటోలోని రూపొందించారు అని నిర్థారించవచ్చు.
ఈ వార్త వైరల్ అవడంతో, Way2News సంస్థ X(ట్విట్టర్) పోస్ట్ ద్వారా స్పందిస్తూ “మా లోగోను ఉపయోగించి కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది మరియు ‘అటాచ్ చేసిన పోస్ట్’ వైరల్‌గా మారింది” అంటూ ఈ వార్త కథనం ఫేక్ అని స్పష్టత ఇచ్చారు.
చివరగా, పొత్తులో భాగంగా జనసేనకు 64 సీట్ల, రెండేళ్లు సీఎం పదవి ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారు అని చెప్తున్న ఈ ‘Way2News’ వార్తా కథనం ఫేక్.