Fake News, Telugu
 

శ్రీ రాముడిని జాతీయ దేవుడిగా ప్రకటించాలని బీజేపీ ఆలోచిస్తుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టుగా షేర్ చేస్తున్న ఈ ‘Way2News’ వార్తా కథనం ఫేక్

0

శ్రీ రాముడిని జాతీయ దేవుడిగా ప్రకటించే ఆలోచన బీజేపీకి ఉంది. ఒకే దేశం ఒకే దేవుడు ఉండాలి.”, అని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టు ‘Way2News’ పబ్లిష్ చేసిన కథనమంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: శ్రీ రాముడిని జాతీయ దేవుడిగా ప్రకటించాలని బీజేపీ ఆలోచిస్తుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యలు, దాన్ని రిపోర్ట్ చేసిన ‘Way2News’ వార్తా కథనం.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటో ఎడిట్ చేయబడినది. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించే ఆలోచన లేదని కిషన్ రెడ్డి లోక్‌సభలో స్పష్టం చేసినట్టుగా 2023 ఆగస్టు నెలలో ‘Way2News’ పబ్లిష్ చేసిన వార్తా కథనాన్ని మార్ఫ్ చేసి ఈ ఫోటోని రూపోంధించారు. శ్రీ రాముడిని జాతీయ దేవుడిగా ప్రకటించాలని బీజేపీ ఆలోచిస్తుందని కిషన్ రెడ్డి ఎప్పుడూ వ్యాఖ్యలు చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో తెలుపుతున్నట్టు శ్రీ రాముడిని జాతీయ దేవుడిగా ప్రకటించబోతున్నట్టు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారా అని వెతికితే, కిషన్ రెడ్డి అటువంటి వ్యాఖ్యలు చేసినట్టు ‘Way2News’తో పాటు మరే వార్తా సంస్థ కూడా రిపోర్ట్ చేయలేదని తెలిసింది. ఒకవేళ కిషన్ రెడ్డి శ్రీరాముడికి సంబంధించి అటువంటి వ్యాఖ్యలు చేసివుంటే, ఆ విషయాన్ని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసేవి.

పోస్టులో షేర్ చేసిన వార్తా కథనం కోసం వెతికితే, ఇదే కిషన్ రెడ్డి ఫోటోని షేర్ చేస్తూ ‘Way2News’ 07 ఆగస్టు 2023 నాడు పబ్లిష్ చేసిన అసలైన వార్తా కథనం దొరికింది. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించే ఆలోచన లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్‌సభలో స్పష్టం చేసినట్టు ఈ వార్తా కథనం రిపోర్ట్ చేసింది. ఈ సమాచారాన్ని రిపోర్ట్ చేస్తూ పలు ఇతరు వార్తా సంస్థలు కూడా 2023 ఆగస్టు నెలలో ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి.  అసలైన ‘Way2News’ కథనాన్ని ఎడిట్ చేస్తూ పోస్టులో షేర్ చేసిన ఫోటోలోని రూపొందించారు.

చివరగా,  శ్రీ రాముడిని జాతీయ దేవుడిగా ప్రకటించాలని బీజేపీ ఆలోచిస్తుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టుగా షేర్ చేస్తున్న ఈ ‘Way2News’ వార్తా కథనం ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll