Fake News, Telugu
 

మహిళలకు నారా లోకేశ్ మోకరిల్లి క్షమాపణలు చెప్పారని చెప్తున్న ఈ ‘Way2News’ వార్త కథనం ఫేక్

0

కదిరిలో జరిగిన టీడీపీ సమావేశంలో 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని మహిళలు ప్రశ్నించగా, గతంలో జరిగిన తప్పులను మన్నించి, ఈ ఒక్కసారి టీడీపీకి ఓటు వేయాలని, మహిళల ముందు నారా లోకేశ్ మోకరిల్లి క్షమాపణలు చెప్పారు అని చెప్తూ షేర్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే, మహిళల ముందు నారా లోకేశ్ మోకరిల్లిన ఫోటోతో ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ‘Way2News’ పబ్లిష్ చేసిన కథనమంటూ ఫోటో ఒకటి వైరల్ అవుతోంది .ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కదిరిలో జరిగిన టీడీపీ సమావేశంలో మహిళలకు నారా లోకేశ్ మోకరిల్లి క్షమాపణలు చెప్పారు

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ ఫోటో 08 మార్చి 2023న పీలేరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారా లోకేశ్ మహిళలందరికీ పాదాభివందనం అంటూ మోకాళ్లపై కూర్చుని వందనం చేసిన సందర్భంలో తీసిన ఫోటోగా తెలిసింది. అంతేకాకుండా,ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో అని ‘Way2News’ సంస్థ X పోస్టు ద్వారా స్పష్టత ఇచ్చింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా వైరల్ పోస్టులో తెలుపుతున్నట్టు ఇటీవల కదిరిలో జరిగిన టీడీపీ సమావేశంలో మహిళల ముందు నారా లోకేశ్ మోకరిల్లి క్షమాపణలు చెప్పారా? అనే విషయాన్ని గురించి తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, వైరల్ పోస్టులో చెప్పినట్లు మహిళల ముందు నారా లోకేశ్ మోకరిల్లి క్షమాపణలు చెప్పారు అని చెప్పే ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు.

అతర్వాత వైరల్ ఫోటోకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వైరల్ ఫోటో 08 మార్చి 2023న పీలేరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారా లోకేశ్ తెలుగు మహిళలతో (టీడీపీ మహిళా కార్యకర్తలు) భేటీ అయ్యారని, ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. అమ్మలేనిది జన్మ లేదని.. ఈ భూమి కన్నా ఎక్కువ భారం మహిళలే మోస్తారని తెలిపారు. అలాంటి మహిళలందరికీ పాదాభివందనం అంటూ లోకేశ్ మోకాళ్లపై కూర్చుని వందనం చేసిన సందర్భంలో తీసిన ఫోటోగా తెలిసింది. ఇదే ఫోటోను రిపోర్ట్ చేస్తున్న పలు వార్తకథనాలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

అంతేకాకుండా, ఈ వార్తను Way2News సంస్థ కూడా ప్రచురించలేదు అని తెలిసింది. వైరల్ పోస్టులో షేర్ చేసిన వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ (https://way2.co/84vdyb) ద్వారా ‘Way2News’లో వెతికితే “BIG BREAKING: సుప్రీంకోర్టు సంచలన తీర్పు” అనే టైటిల్‌తో ప్రచురించిన అసలైన వార్త దొరికింది. దీన్ని బట్టి అసలైన ‘Way2News’ కథనాన్ని ఎడిట్ చేస్తూ పోస్టులో షేర్ చేసిన ఫోటోని రూపొందించారు అని నిర్థారించవచ్చు.

ఈ వార్త వైరల్ అవడంతో, Way2News సంస్థ X(ట్విట్టర్) పోస్ట్ ద్వారా స్పందిస్తూ “మా లోగోను ఉపయోగించి కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది మరియు ‘అటాచ్ చేసిన పోస్ట్’ వైరల్‌గా మారింది” అంటూ ఈ వార్త కథనం ఫేక్ అని స్పష్టత ఇచ్చారు.

చివరగా, ఈ వైరల్ ఫోటో మార్చి 2023లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తీసింది, అలాగే సమావేశంలో మహిళలకు నారా మోకరిల్లి క్షమాపణలు చెప్పారు అని చెప్తున్న ఈ ‘Way2News’ వార్త కథనం కూడా ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll