“ఒక సమావేశంలో ఓ యువతి హిందూస్తాన్ జిందాబాద్ నినాదాలు చేస్తుండగా, అసదుద్దీన్ ఒవైసీ ఆ యువతిని హిందూస్తాన్ జిందాబాద్ నినాదాలు చేయకుండా ఆపాడు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఒక సమావేశంలో ఓ యువతి హిందూస్తాన్ జిందాబాద్ నినాదాలు చేస్తుండగా, అసదుద్దీన్ ఒవైసీ ఆ యువతిని హిందూస్తాన్ జిందాబాద్ నినాదాలు చేయకుండా ఆపాడు.
ఫాక్ట్(నిజం): 20 ఫిబ్రవరి 2020న బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో పౌరసత్వ సవరణ చట్టం (CAA)కి వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశంలో MIM అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగం ముగించుకుని వెళ్తుండగా, అకస్మాత్తుగా వేదికపైకి వచ్చిన అమూల్య లియోనా అనే యువతి మైక్రోఫోన్ తీసుకొని ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని నినాదాలు చేసింది. వెంటనే వేదికపై ఉన్న అసదుద్దీన్ ఒవైసీ ఆ యువతిని నినాదాలు చేయకుండా అడ్డుకున్ని మైక్ గుంజుకునే యత్నం చేశారు. పాక్‌కు అనుకూలంగా యువతి చేసిన నినాదాలను అదే సభలో ఒవైసీ ఖండించారు. యువతిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 124 కింద దేశద్రోహం కేసు నమోదు చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ వైరల్ వీడియో యొక్క అధిక నిడివి గల అనేక వీడియోలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) లభించాయి.ఈ వీడియోల వివరణల ప్రకారం, ఈ ఘటన 20 ఫిబ్రవరి 2020న బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో పౌరసత్వ సవరణ చట్టం (CAA)కి వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశంలో జరిగింది. ఈ వీడియోలలో మనం ఓ తీసుకొని ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని నినాదాలు చేస్తుండగా, అక్కడే వేదికపై ఉన్న అసదుద్దీన్ ఒవైసీ ఆ యువతిని నినాదాలు చేయకుండా అడ్డుకున్ని మైక్ గుంజుకునే ప్రయత్నం చేయడం చూడవచ్చు. ఈ కథనాలు ‘’పాకిస్తాన్ జిందాబాద్’ అని నినాదాలు చేసిన యువతి బెంగళూరుకు చెందిన అమూల్య లియోనాగా పేర్కొన్నాయి.
ఈ ఘటనపై అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అసహనం వ్యక్తంచేస్తూ పాక్‌కు అనుకూలంగా యువతి చేసిన నినాదాలను అదే సభలో ఒవైసీ ఖండించారు. అమూల్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘ఇలా జరుగుతుందని భావిస్తే అసలు ఈ సభకే రాకుండా ఉండేవాణ్ని’ అని సభ నిర్వాహకులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు (ఇక్కడ, ఇక్కడ).

అలాగే ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని నినాదాలు చేసిన అమూల్య లియోనాపై బెంగుళూరు పోలీసులు ఐపీసీ సెక్షన్ 124 కింద దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన FIR కాపీని ఇక్కడ చూడవచ్చు. ఈ కేసులో నిర్ణీత సమయంలోపు పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలమవడంతో అమూల్య లియోనాకు 12 జూన్ 2020న బెంగుళూరు సిటీ 5వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు (ACMM) మేజిస్ట్రేట్ డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలకు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఫిబ్రవరి 2020లో బెంగళూరులో పౌరసత్వ సవరణ చట్టం (CAA)కి వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశంలో అమూల్య లియోనా అనే యువతి ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని నినాదాలు చేస్తుండగా అసదుద్దీన్ ఒవైసీ అడ్డుకున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది.