తాజాగా రిలీజ్ అయిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాని చూసి లాల్ కృష్ణ అడ్వాణీ ఏడిచారు అని చెప్తూ, ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాని చూసి లాల్ కృష్ణ అడ్వాణీ ఏడుస్తున్న వీడియో.
ఫాక్ట్: ఈ వీడియో ‘శిఖర’ సినిమా ప్రదర్శన సందర్భంగా తీసినది. పోస్ట్‌లోని వీడియోకీ, ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకి సంబంధంలేదు. కాకపోతే, రెండు సినిమాలు కూడా కాశ్మీరీ పండిట్ల జీవితాల ఆధారంగా తెరకెక్కినవే. కావున పోస్ట్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, ఆ వీడియోకి సంబంధించి వివిధ వార్తాసంస్థలు ప్రచురించిన న్యూస్ ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చాయి. “భావోద్వేగానికి గురైన భాజపా అగ్రనేత అడ్వాణీ!”, అనే టైటిల్ పెట్టి, ‘ఈనాడు’ వారు ఆ వీడియో గురించి ఫిబ్రవరి 2020లో ప్రచురించిన అర్టికల్‌ని ఇక్కడ చదవచ్చు. ఆ వీడియో ‘శిఖర’ సినిమా ప్రదర్శన సందర్భంగా తీసినట్టు తెలుస్తుంది. ‘శిఖర’ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.
అంతేకాదు, ‘విధు వినోద్ చోప్రా ఫిల్మ్స్’ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ మరియు ట్విట్టర్ అకౌంట్లు కూడా 2020లో వీడియోను పోస్ట్ చేసి, ఆ వీడియో ‘శిఖర’ సినిమా ప్రదర్శన సందర్భంగా తీసినదని రాసినట్టు చూడవచ్చు.
చివరగా, అడ్వాణీ భావోద్వేగానికి గురైన ఈ వీడియో ‘శిఖర’ సినిమా ప్రదర్శన సందర్భంగా తీసినది; ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకి సంబంధంలేదు.