Fake News, Telugu
 

2016లో తీసిన పాత ఫోటోని ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటో అని షేర్ చేస్తున్నారు

0

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఇటీవల ఆరోగ్యం బాగా లేకుంటే 108లో తానే స్వయంగా వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ వార్డులో చికిత్స పొందారు, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోది ఇటీవల ఆరోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన దృశ్యం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో పాతది. ఈ ఫోటోని 2016లో హీరాబెన్ మోదీ చాతి నొప్పితో గుజరాత్ గాంధీనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు తీసారు. హీరాబెన్ మోదీ ఇటీవల ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని ‘జీ న్యూస్’ వార్తా సంస్థ 27 ఫిబ్రవరి 2016 నాడు పబ్లిష్ చేసిన తమ ఆర్టికల్‌లో షేర్ చేసినట్టు తెలిసింది. నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అనారోగ్యానికి గురికావడంతో ఆమెని గుజరాత్ గాంధీనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు.

ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ మరికొన్ని వార్తా సంస్థలు కూడా ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. 26 ఫిబ్రవరి 2022 నాడు అర్ధాంతరంగా చాతిలో నొప్పి కలగడంతో హీరాబెన్ మోదీ వెంటనే గాంధీనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినట్టు ఈ ఆర్టికల్స్‌లో తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాలలో బీజేపి ఘనవిజయం సాధించిన తరువాత నరేంద్ర మోదీ 11 మర్చి 2022 నాడు గుజరాత్‌లో నివాసముంటున్న తన తల్లి హీరాబెన్ మోదీని కలుసుకున్నారు. హీరాబెన్ మోదీ ఇటీవల ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు.

చివరగా, 2016లో తీసిన పాత ఫోటోని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఇటీవల ఆరోగ్య సమస్యతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న దృశ్యమంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll