Fake News, Telugu
 

కొందరు వ్యక్తులు ఒక మహిళను కొడుతున్న ఈ వీడియో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది కాదు

0

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎస్టీ మహిళపై అరాచకం’, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియా కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొందరు వ్యక్తులు ఒక ఎస్టీ మహిళను కొడుతున్న వీడియో.

ఫాక్ట్: కొందరు వ్యక్తులు ఒక మహిళను కొడుతున్న వీడియోలోని ఈ ఘటన జరిగింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో; పోస్ట్‌లో చెప్పినట్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాదు. ఆ ఘటన జరిగింది 2021లో. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, అవే దృశ్యాలతో వివిధ వార్తాసంస్థలు 2021లో ప్రచురించిన ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్‌లో వస్తాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవచ్చు. వీడియోలో దెబ్బలు తింటున్న మహిళ తన అత్తగారింటి నుండి బయటికి వచ్చేసి, వేరే దగ్గరికి వెళ్లినందుకు తన కుటుంబ సభ్యులు తనని కొట్టినట్టు తెలిసింది. ఈ ఘటన జరిగింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, పోస్ట్‌లో చెప్పినట్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాదు.

ఇదే వీడియో 2021లో కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినట్టు సోషల్ మీడియాలో షేర్ అయినప్పుడు, అది తప్పని చెప్తూ మొరాదాబాద్ పోలీసులు చేసిన ట్వీట్‌ని ఇక్కడ చూడవచ్చు.

పోస్ట్‌లోని వీడియోలో ఒక వ్యక్తి మాట్లాడుతున్న సేల్ఫీ వీడియో క్లిప్ కూడా ఉంది. ఆ సేల్ఫీ వీడియోకి, మహిళను కొడుతున్న వీడియోకి సంబంధంలేదు. ఆ సేల్ఫీ వీడియో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిందే. ఆ కేసులో తగిన చర్యలు తీసుకున్నామని చెప్తూ మొరాదాబాద్ పోలీసులు తెలిపారు.

చివరగా, కొందరు వ్యక్తులు ఒక మహిళను కొడుతున్న వీడియో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది కాదు; అది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఒక ఘటనకి సంబంధించింది.

Share.

About Author

Comments are closed.

scroll