Fake News, Telugu
 

సంబంధంలేని వీడియో పెట్టి, మిడతలను తినటానికి హైదరాబాద్ లో పావురాలను వదులుతున్నట్టు షేర్ చేస్తున్నారు.

0

దేశంలో వివిధ చోట్ల మిడతల దండు సంచరిస్తున్న సమయంలో, ‘మిడతలను తినటానికి హైదరాబాద్ లో పావురాలను వదిలారు’ అని చెప్తూ, ఒక వీడియోని సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మిడతలను తినటానికి హైదరబాద్ లో పావురాలను వదులుతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): హైదరబాద్ లోకి గానీ, తెలంగాణ లోకి గానీ మిడతల దండు ప్రవేశించినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. మిడతల దండు ఆదిలాబాద్ లోకి ప్రవేశించవచ్చని జిల్లా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, అక్కడ కూడా వీడియోలో చూపెట్టినట్టుగా పావురాలను వదలలేదు. మిడతల దండును నియంత్రించడానికి ముఖ్యంగా పురుగుమందులు వాడతారు. అంతేకాదు, పోస్టులో పెట్టిన వీడియో లాంటి చాలా వీడియోలు యూట్యూబ్ లో పక్షుల రేస్ కి సంబంధించి ఉన్నట్టు చూడవొచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులోని విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, అసలు హైదరబాద్ లోకి గానీ, తెలంగాణ లోకి గానీ మిడతల దండు ప్రవేశించినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. అంతేకాదు, ‘మిడతల దండు మహారాష్ట్రలోనే సంచరిస్తోందని, అటు నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల వైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి’ అని నిపుణుల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపినట్టు ‘ఈనాడు’ ఆర్టికల్ లో చదవొచ్చు. కేంద్ర ప్రభుత్వం కి సంబంధించిన ప్రెస్ రిలీజ్ మరియు ‘Food and  Agriculture Organization’ రిలీజ్ చేసిన బులెటిన్ లలో కూడా మిడతల దండు మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర లోకి ప్రవేశించినట్టు చదవొచ్చు. అయితే, ఆదిలాబాద్ లోకి మిడతల దండు ప్రవేశించవచ్చని జిల్లా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, పోస్టులోని వీడియోలో చూపెట్టినట్టుగా పావురాలను వదలలేదు.

మిడతల దండును నియంత్రించడానికి ముఖ్యంగా పురుగుమందులు వాడతారాని ‘Food and  Agriculture Organization’ వారి వెబ్సైటులో మరియు కేంద్ర వ్యవసాయ శాఖ వారి డాక్యుమెంట్ లో చదవొచ్చు. అయితే, మిడతలు తినే పక్షులు కూడా ఉపయోగించవచ్చని తమిళనాడు అధికారులు తెలిపినట్టు ‘The Hindu’ ఆర్టికల్ లో చదవొచ్చు.

పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అలాంటి చాలా వీడియోలు యూట్యూబ్ లో పక్షుల రేస్ కి సంబంధించి ఉన్నట్టు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, సంబంధంలేని వీడియో పెట్టి, మిడతలను తినటానికి హైదరబాద్ లో పావురాలను వదులుతున్నట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు. అసలు హైదరాబాద్ లోకి మిడతల దండు ప్రవేశించలేదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll