‘గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన కోవిడ్-19 క్వారంటైన్ సెంటర్ లో ఉత్సాహంతో ధైర్యాన్ని పెంచుకుంటున్న పేషెంట్లు’ అని చెప్తూ, కొందరు వ్యక్తులు డాన్స్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. అదే వీడియోని పెట్టి, కొందరు చెన్నై వీడియో (ఆర్కైవ్డ్) అని, మరికొందరు ముంబై వీడియో (ఆర్కైవ్డ్) అని షేర్ చేసినట్టు కూడా చూడవొచ్చు. అయితే, ఆ వీడియో తీసినది త్రిపుర లోని హపనియా ఎక్సిబిషన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ లో అని FACTLY విశ్లేషణలో తేలింది. ఆ వీడియోకి సంబంధించి మరొక కోణం నుండి తీసిన వీడియోని ‘Inside Northeast’ అనే యూట్యూబ్ లో పోస్ట్ చేసి, అది అగర్తలా (త్రిపురా) కి సంబంధించిన వీడియో అని పోస్ట్ చేసింది. ఆ వీడియోలోని బిల్డింగ్, హపనియా ఎక్సిబిషన్ సెంటర్ తో పోలి ఉన్నట్టు ఈ ఫోటోలో చూడవొచ్చు. అంతేకాదు, అది త్రిపురా వీడియో అని వార్తాసంస్థలు ప్రచురించిన వార్తలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. వీడియోలో చివరికి చూపించే క్రికెట్ ఆడుతున్న వీడియో కూడా బారాముల్లా (జమ్మూ కాశ్మీర్) లోని క్వారంటైన్ సెంటర్ కి సంబంధించిన వీడియో అని FACTLY ఇంతకముందే రాసిన ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.
సోర్సెస్:
క్లెయిమ్ – యూట్యూబ్ వీడియో (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ –
1. వీడియో ‘Inside Northeast’ – https://youtu.be/SH75eVyKUn8?t=32
2. ‘Zee News’ ఆర్టికల్ – https://zeenews.india.com/hindi/india/states/agartala-covid-19-patients-doing-lungi-dance-inside-quarantine-centre/693789
3. ‘NDTV’ వీడియో – https://www.facebook.com/ndtv/videos/279896039824642/?v=279896039824642
Did you watch our new video?