Fake News, Telugu
 

నగ్నంగా ఉన్న వ్యక్తి పోలీసును లాఠీతో కొట్టిన ఈ వీడియో మణిపూర్‌లో తీసింది కాదు. ఇది ఉత్తరప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల సమయంలో జరిగింది.

0

మణిపూర్ హింసాకాండ నేపథ్యంలో, ఒక వ్యక్తి పోలీసులను లాఠీతో కొట్టి, తరుముతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సంఘటన మణిపూర్‌లో జరిగిందని మరియు నగ్నంగా ఉన్న ఒక స్త్రీ రోడ్ మీద పోలీసులను తరుముతున్నట్టు దీని వివరణలో తెలిపారు. ఈ కథనం ద్వారా ఈ వీడియోలో ఎంత నిజం ఉందో చూద్దాం. 

క్లెయిమ్: మణిపూర్‌లో నగ్నంగా ఉన్న ఒక మహిళ, పోలీసులను లాఠీతో కొట్టి, తరుముతున్న వీడియో 

ఫాక్ట్(నిజం): ఈ వీడియో మణిపూర్‌కు చెందినది కాదు. ఇది ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలోని పండిట్ దీన దయాళ్ నగర్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తీసింది. ఓట్లను తిరిగి లెక్కించాలని డిమాండ్ చేస్తూ సోను కిన్నార్ అనే స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారులు కౌంటింగ్ కేంద్రం వెలుపల గుమిగూడి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైరల్ వీడియో ఈ సంఘటనను చూపిస్తుంది. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

వీడియో వివరాలను పరిశోధించడానికి, మేము ఫుటేజ్ నుండి కొన్ని కీఫ్రేమ్‌లను ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాము. ఇది లక్నోకు చెందిన జర్నలిస్టు జ్ఞానేంద్ర శుక్లా చేసిన ట్వీట్‌కి దారితీసింది. అతని ట్వీట్ ప్రకారం, ఈ వీడియో చందౌలీలోని పండిట్ దీన దయాళ్ నగర్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో తీసింది. స్వతంత్ర అభ్యర్థి సోను కిన్నార్ మద్దతుదారులు కౌంటింగ్ కేంద్రం వెలుపల గుమిగూడి రీకౌంటింగ్ కోసం నిరసన వ్యక్తం చేశారు. రీకౌంటింగ్ తర్వాత సోను కిన్నార్‌ను PDDU (పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ నగర్) అధ్యక్షుడిగా ప్రకటించారు.


తదుపరి విచారణలో ఘటనకు సంబంధించిన వార్తా కథనాలు దొరికాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). అమర్ ఉజాలా, సోను కిన్నర్ మద్దతుదారుల వల్ల జరిగిన గందరగోళంపై రాసిన ఒక వార్త కథనంలో, జ్ఞానేంద్ర శుక్లా ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోతో సరిపోయే దృశ్యం యొక్క ఫోటో కలిగి ఉంది.

అదనంగా, సోను కిన్నర్ మద్దతుదారులకు మరియు పోలీసులకు మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన విజువల్స్‌ను UP తక్ యొక్క వీడియో రిపోర్టులో ఉంది. వైరల్ వీడియోలో రోడ్డు పక్కన కనిపించే తెల్లటి గోడ ఈ రిపోర్టులోని ఫుటేజ్‌లో ఉన్న గోడతో మరియు వెనుక ఉన్న ఒక బిల్డింగ్ తోటి సరితూగుతుంది. నిరసన తెలిపిన మద్దతుదారులు ట్రాన్స్ జెండర్ అని, సోను కిన్నార్ స్వయంగా ట్రాన్స్ జెండర్ అని ఈ రిపోర్టులు నివేదించాయి.

చివరిగా, నగ్నంగా ఉన్న వ్యక్తి పోలీసును లాఠీతో కొట్టినట్లు చిత్రీకరించిన వీడియో మణిపూర్‌లో జరగలేదు. ఇది ఉత్తరప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల సమయంలో జరిగింది.

Share.

About Author

Comments are closed.

scroll