Fake News, Telugu
 

రైతు నిరసనలకు సంబంధించిన పాత ఫోటోని పోలీసులు ఇటీవల రెజ్లర్ సాక్షి మాలిక్‌ తలపై బూట్ ఉంచి క్రూరంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

కొత్త పార్లమెంట్ భవనం ప్రారభోత్సవం సందర్భంగా మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మన ఆడబిడ్డ ఒలంపిక్ మెడలిస్ట్ సాక్షి మల్లిక్ గారికి మోడీ గారు ఇచ్చిన గొప్ప గౌరవం”, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. పోలీసులు ఒక వ్యక్తి తలపై బూటు పెట్టి ఆ వ్యక్తిని అదుపు చేస్తున్న చిత్రాన్ని ఈ ఫోటోలో చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పోలీసులు రెజ్లర్ సాక్షి మాలిక్ తలపై బూటు పెట్టి ఆమెతో క్రూరంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): 2021లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన నిరసనలో, రంజిత్ సింగ్ అనే వ్యక్తి, పోలీస్ అధికారిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడని పోలీసులు అతని తలపై బూట్ పెట్టి అదుపులోకి తీసుకున్న చిత్రాన్ని ఈ ఫోటో చూపిస్తుంది. ఈ ఫోటోకు రెజ్లర్ సాక్షి మాలిక్‌కు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోను రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ పబ్లిష్ 01 ఫిబ్రవరి 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలో భాగంగా రంజిత్ సింగ్ అనే వ్యక్తి, పోలీస్ అధికారిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడని, పోలీసులు అతని తలపై బూట్ పెట్టి అదుపులోకి తీసుకున్న చిత్రమని ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేశారు.

ఈ ఫోటోని షేర్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ చేస్తూ భారత రెజ్లర్‌లు ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, 28 అక్టోబర్ 2023 నాడు, జంతర్ మంతర్ నుంచి కొత్త పార్లమెంట్ భవనం వైపు మార్చ్ చేసేందుకు ప్రయత్నించిన రెజ్లర్లను భద్రతా సిబ్బంది బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు రెజ్లర్ సాక్షి మాలిక్‌ను అదుపులోకి తీసుకుంటున్న చిత్రాలను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. కానీ, పోస్టులో షేర్ చేసిన ఫోటో పాతది మరియు సాక్షి మాలిక్‌కు సంబంధించినది కాదు.

చివరగా, రైతు నిరసనలకు సంబంధించిన పాత ఫోటోని పోలీసులు ఇటీవల రెజ్లర్ సాక్షి మాలిక్‌ తలపై బూట్ ఉంచి క్రూరంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll