జపాన్ లోని ఓకాసా – టోక్యో మధ్య ఉన్న 515 కిలోమీటర్ల దూరాన్ని, గంటకు 4800 కిలోమీటర్ల వేగంతో కేవలం 10 నిమిషాలలో చేరుకొని చరిత్ర సృష్టించిన సరికొత్త జపనీస్ ఎలక్ట్రిక్ ట్రైన్, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: జపాన్ దేశానికి చెందిన ఎలక్ట్రిక్ ట్రైన్, గంటకు 4800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో టైం-లాప్స్ టెక్నాలజీ ద్వార రూపొందించినది. ఈ వీడియోని ‘Time variant hyper-lapse/time-lapse’ అనే టెక్నాలజీ సహాయంతో రూపొందించినట్టు ఈ వీడియోని మొదటగా అప్లోడ్ చేసిన యూట్యూబ్ ఛానల్ తెలిపింది. ఓకాసా – టోక్యో మధ్య నడిచే Shinkansen బులెట్ ట్రైన, గంటకి అత్యధికంగా 285 కిలోమీటర్లు వేగంతో వెల్లగలుగుతుంది. ఈ ట్రైన్ ఓకాసా నుండి టోక్యో చేరుకోవడానికి రెండున్నర గంటల సమయం తీసుకుంటుంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ వీడియో యొక్క సమాచారం కోసం కీ వర్డ్స్ వాడి గూగుల్ లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన యూట్యూబ్ వీడియో లింకుని చాలా మంది యూసర్లు తమ సోషల్ మీడియా పేజిలలో షేర్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్ నుంచి తొలగించారు. కానీ, ఈ యూట్యూబ్ వీడియో యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్స్ మాకు దొరికాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోని ‘FERMATA STUDIO’ (పోస్టులో షేర్ చేసిన వీడియోలో ఈ పేరు కనపడుతుంది) అనే యూట్యూబ్ ఛానల్ మొదటగా పోస్ట్ చేసినట్టు తెలిసింది. “This video is a fiction. Normally it takes 2.5 hours from Shin-Osaka to Tokyo (515km). Made by a method called ‘Time variant hyper-lapse/time-lapse’”, అని ఈ వీడియో వివరణలో తెలిపారు.
గూగుల్ తెలిపిన సమాచారం ప్రకారం, జపాన్ దేశానికి చెందిన Shinkansen బులెట్ ట్రైన్, ఓకాసా నుండి టోక్యో చేరుకోవడానికి రెండున్నర గంటల సమయం తీసుకుంటదని తెలిపారు. ఈ బులెట్ ట్రైన్ గంటకి అధికంగా 285 కిలోమీటర్లు ప్రయానిస్తుందని, ‘Central Japan Railway Company’ తమ వెబ్సైటులో తెలిపారు. గంటకి 375 మైళ్ళ అత్యధిక వేగంతో ప్రయాణించే జపాన్ JR Central’s SCMAGLEV బులెట్ ట్రైన్ కి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు, ఈ వీడియోని డిబంక్ చేస్తూ చాలా ఫాక్ట్-చెకింగ్ సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి.
చివరగా, గంటకు 4800 కిలోమీటర్ల వేగంతో జపాన్ రైలు ప్రయనిస్తునట్టుగా షేర్ అవుతున్న ఈ వీడియో సిములేషన్ టైం-లాప్స్ టెక్నాలజీ ద్వార రూపొందించింది, నిజమైంది కాదు.