Fake News, Telugu
 

ఈ వీడియో ఇటీవల సత్తుపల్లిలో సంచరిస్తున్న పులికి సంబంధించింది కాదు

0

సత్తుపల్లిలో పులి సంచరిస్తోందని, దీనివల్ల స్థానికులు భయాందోళన చెందుతుందని ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ వీడియో ఇటీవల తీసిందిగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల సత్తుపల్లిలో పులి సంచరిస్తున్న వీడియో.

ఫాక్ట్: ఈ వీడియో కనీసం అక్టోబర్ 2020 నుండి ఇంటర్నెట్‌లో షేర్ అవుతుంది. ఖమ్మం జిల్లాలోని మోతుగూడెం అడవిలో ఇలా ఓ పెద్దపులి గంభీరంగా నడుస్తూ సంచరించిందని 18 అక్టోబర్ 2020న ప్రచురించిన ఒక ఆర్టికల్‌లో తెలిపారు. ఇటీవల, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఫారెస్ట్ రేంజ్ ఏరియాలో పెద్దపులి యొక్క పాదముద్రలను గుర్తించారు. ప్రజలెవరూ అడవిలోకి వెళ్ళకూడదని అధికారులు ఆదేశించారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.       

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే వీడియో కనీసం అక్టోబర్ 2020 నుండి ఇంటర్నెట్‌లో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ అవుతుంది.

అదే వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్ ఉన్న ఒక ఆర్టికల్ 18 అక్టోబర్ 2020న ప్రచురించినట్టు తెలుస్తుంది. ఖమ్మం జిల్లాలోని మోతుగూడెం అడవిలో ఇలా ఓ పెద్దపులి గంభీరంగా నడుస్తూ సంచరించిందని; ఈ పెద్దపులి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడకి వెళ్లింది, ఎక్కడ ఉంటుంది, వంటి అంశాలను అటవీ అధికారులు పరిశీలిస్తున్నారని ఆర్టికల్‌లో తెలిపారు.

ఇటీవల, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఫారెస్ట్ రేంజ్ ఏరియాలో పెద్దపులి యొక్క పాదముద్రలను స్థానిక పశువుల కాపరులు గుర్తించినట్టు తెలుస్తుంది. ప్రజలెవరూ అడవిలోకి వెళ్ళకూడదని అధికారులు ఆదేశించారు. కానీ, ఆ పెద్దపులి యొక్క ఏ వీడియోలు లభించలేదు.

చివరగా, ఈ వీడియో ఇటీవల సత్తుపల్లిలో సంచరిస్తున్న పులికి సంబంధించింది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll