Fake News, Telugu
 

వీడియోలోని వ్యక్తి పేరు ‘సయీద్ ఇర్షాద్ అహమద్ అల్ భుకారి’; తను మాట్లాడింది బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్‌లో

0

హిందువులు మర్యాదగా మా ముస్లిం మతంలోకి మారండి లేకుంటే బలవంతంగా మిమ్మల్ని మతం మారుస్తాం”, అని భారతీయ ముస్లింలు హెచ్చరిస్తున్నారని అర్థం వచ్చేలా రాసి, ఒక వీడియోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు.  “సెక్యూలర్ హిందువులు చూసే వరకు షేర్ చేయండి.ముస్లిం దగ్గర మీరు కొనే ప్రతి రూపాయి నీ పిల్లల చావుకి ఇస్తున్నట్టే”, అని కూడా పోస్ట్‌లో రాసారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ముస్లిం మతంలోకి మారండని భారత ముస్లింలు హిందువులను హెచ్చరిస్తున్న వీడియో.

ఫాక్ట్: వీడియోలోని వ్యక్తి పేరు ‘సయీద్ ఇర్షాద్ అహమద్ అల్ భుకారి’. తను మాట్లాడింది భారతదేశంలో కాదు; తను మాట్లాడింది బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్‌లో. యతి నర్సింహానంద్ సరస్వతి ఇస్లాంపై చేసిన వ్యాఖ్యలపై సయీద్ ఇర్షాద్ స్పందించాడు. కావున, పోస్ట్‌లో వీడియోని భారతదేశంలోని ముస్లింలకు ముడిపెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, కొంతమంది అలాంటి వీడియోనే మే 2021లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. పోస్ట్‌లోని వీడియో కంటే ఆ పాత వీడియోల నిడివి ఎక్కువ ఉంది. వీడియో మొదట్లో ఒక వ్యక్తి మాట్లాడుతూ తను బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్ నుండి మాట్లాడుతున్నట్టు చెప్తాడు. ఆ కీ-వర్డ్స్‌తో ఇంటర్నెట్‌లో వెతకగా, వీడియోలోని వ్యక్తికి సంబంధించిన ఫేస్బుక్ ప్రొఫైల్ దొరికింది. తన పేరు ‘సయీద్ ఇర్షాద్ అహమద్ అల్ భుకారి’. తన ప్రొఫైల్‌లో పోస్ట్‌లోని వీడియో యొక్క పూర్తి వెర్షన్ ఉన్నట్టు చూడవొచ్చు.

యతి నర్సింహానంద్ సరస్వతి ఇస్లాంపై చేసిన వ్యాఖ్యలపై సయీద్ ఇర్షాద్ స్పందించినట్టు వీడియోలో చూడవొచ్చు. వీడియోలోని ముస్లిం వ్యక్తి మాట్లాడింది భారతదేశంలో కాదు; తను మాట్లాడింది బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్‌లో. ఆ ప్రదేశానికి (ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్) సంబంధించిన ఫోటోలు కూడా తను పోస్ట్ చేసాడు. కాబట్టి, ఆ వీడియోని భారతదేశంలోని ముస్లింలకు ముడిపెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

చివరగా, వీడియోలోని వ్యక్తి మాట్లాడింది భారతదేశంలో కాదు; తను మాట్లాడింది బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్‌లో.

Share.

About Author

Comments are closed.

scroll