Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్ లో వైద్య సిబ్బంది కరోనా రాకుండా పాటిస్తున్నది ఈ వీడియోలో చూపెట్టిన ఎక్సర్‌సైజ్ కాదు.

0

అక్యుప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ చేయడం ద్వారా దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్ లో 600 మంది వైద్య సిబ్బంది తమకు కరోనా రాకుండా చూసుకున్నారని చెప్తూ, ఒక ఎక్సర్‌సైజ్ వీడియోని ఫేస్బుక్ లో కొంతమంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా):  వీడియోలో చూపెట్టిన ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్ లో 600 మంది వైద్య సిబ్బంది తమకు కరోనా రాకుండా చూసుకున్నారు.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఎక్సర్‌సైజ్ కి, దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్ కి అసలు సంబంధంలేదు. ఆ హాస్పిటల్ లోని సిబ్బంది పాటిస్తుంది ‘జల్‌నీతి’ అనే  ఒక యోగా ప్రక్రియ. వీడియోలో చూపెట్టిన ఎక్సర్‌సైజ్ కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, పూణే లోని దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్ లో వైద్య సిబ్బంది పాటిస్తున్న ఎక్సర్‌సైజ్ గురించి ‘పూణే మిర్రర్’ వార్తాసంస్థ ప్రచురించిన ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ హాస్పిటల్ లోని సిబ్బంది పాటిస్తుంది ‘జల్‌నీతి’ అనే  ఒక యోగా ప్రక్రియ అని న్యూస్ ఆర్టికల్ లో చదవొచ్చు. ‘జల్‌నీతి’ ఎలా చేయాలో డాక్టర్ కేల్కర్ వివరిస్తున్న వీడియోని కూడా చూడవొచ్చు. హాస్పిటల్ వారు కూడా ‘జల్‌నీతి’ కి సంబంధించిన రెండు వీడియో లింక్లను తమ ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసారు.

ఆరు వందల మంది సిబ్బంది ‘జల్‌నీతి’ రోజు చేయడానికి ఒప్పుకున్నారని, ఈ ఎక్సర్‌సైజ్ చేస్తున్నవారికి ఇంతవరకు ఎవరకీ కరోనా రాలేదని డాక్టర్ కేల్కర్ తెలిపారు. అయితే, ఈ ఎక్సర్‌సైజ్ చేస్తుండడం వల్లే వారికి కరోనా రాలేదని కచ్చితంగా తెలుసుకోవడానికి ఇంకో మూడు నెలలు చూసి ఒక స్టడీ నిర్వహిస్తామని జూలై లో డాక్టర్ కేల్కర్ తెలిపారు.

పోస్ట్ చేసిన వీడియోలోని వ్యక్తి గురించి వెతకగా, అతని పేరు ప్రకాష్ శేషాద్రి అని తెలిసింది. అతను ‘సీ చేంజ్’ అనే కన్సల్టెన్సీ యొక్క సహ వ్యవస్థాపకుడు. తన గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూడవొచ్చు. పోస్ట్ లోని వీడియోని తన ఫేస్బుక్ అకౌంట్ లో 05 ఏప్రిల్ 2020 న పోస్ట్ చేసాడు. అతను వీడియోలో చూపిస్తున్న అక్యుప్రెషర్ ఎక్సర్‌సైజ్ కి, దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్ లో సిబ్బంది పాటిస్తున్న ‘జల్‌నీతి’ ప్రక్రియకి సంబంధంలేదు. ప్రకాష్ శేషాద్రి కూడా తాను చెప్తున్న ఎక్సర్‌సైజ్ దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్ వారు పాటిస్తున్నారని తన వీడియోలో ఎక్కడా చెప్పలేదు.

చివరగా, దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్ లో వైద్య సిబ్బంది కరోనా రాకుండా పాటిస్తున్నది ఈ వీడియోలో చూపెట్టిన ఎక్సర్‌సైజ్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll