Fake News, Telugu
 

ఈ వీడియో లో సముద్రం నుండి మేఘం నీళ్లు తీసుకోవట్లేదు; ఇది వాటర్‌స్పౌట్ లేదా నీటి స్తంభము అనే సహజ ప్రకృతి ప్రక్రియ

0

‘సముద్రం నుండి నీటిని తీసుకొంటున్న మేఘం’ అని చెప్తున్న ఒక వీడియో సోషల్ మీడియా లో షేర్ చెయ్యబడుతోంది. ఇందులోని నిజానిజాలు ఈ పోస్టు ద్వారా తెలుసుకొందాం.

క్లెయిమ్: ‘సముద్రం నుండి నీటిని తీసుకొంటున్న మేఘం’.

ఫాక్ట్ (నిజం): వీడియోలో కనబడుతున్నది నీటి స్తంభం (వాటర్‌స్పౌట్) అనే సహజ ప్రకృతి ప్రక్రియ. ఇందులో నీటిని సముద్రం లో నుండి మేఘం తీసుకోవడం జరగదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వీడియో లోని కొన్ని ఫ్రేమ్స్ ని మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, ఒక ఫేస్బుక్ పోస్ట్ దొరికింది. రాబ్ పెరిల్లో అనే వాతావరణ శాస్త్రవేత్త 21 ఆగష్టు 2020న ఈ పోస్ట్ ను అప్లోడ్ చేసారు.  లూసియానాలో అద్భుతమైన వాటర్‌స్పౌట్ అని పోస్ట్ లో రాసారు. పోస్ట్ లోని వీడియో ఈయన పోస్ట్ లోని వీడియోతో సరిపోలి ఉంది.

వాటర్‌స్పౌట్ గురించి గూగుల్ లో సెర్చ్ చెయ్యగా వాటర్‌స్పౌట్ అనేది తిరిగే మేఘంతో నిండిన గాలి యొక్క నిలువు వరుస (ఒక స్థంభం లేదా గొట్టం లాగ) అని తెలిసింది. వాటర్‌స్పౌట్ క్యుములస్ మేఘం నుండి సముద్రం లేదా సరస్సులోకి దిగుతుంది. దీనిని నీటి స్తంభము అని కూడా అంటారు.

నేషనల్ జియోగ్రాఫిక్ వెబ్సైటు ప్రకారం నీటి స్థంభం అనే పేరు ఉన్నా కూడా అందులో సముద్రం లేదా సరస్సు యొక్క నీరు ఉండదు. మేఘంలో జరిగే సంక్షేపణం (కండెన్‌సేషన్) అనే ప్రక్రియ వల్ల నీటి స్తంభాల్లో నీరు ఉంటుంది.  దీని గురించి మరిన్ని వివరాల ఇక్కడ, ఇక్కడ చూడవొచ్చు.

చివరిగా, వాటర్‌స్పౌట్ అనే ప్రకృతి బద్దమైన చర్యని సముద్రం నుండి నీళ్లు తీసుకొంటున్న మేఘాలు అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll