కెనడా ప్రభుత్వం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ను నిషేధించిందని, దాని కార్యకర్తలను దేశం విడిచి వెళ్ళమని ఆదేశించిందని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కెనడాలో RSSపై నిషేధం విధిస్తున్నట్లు ఒక కెనడా ప్రభుత్వ అధికారి ప్రకటన చేస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు స్టీఫెన్ బ్రౌన్, అతను కెనడా ప్రభుత్వ అధికారి కాదు. స్టీఫెన్ బ్రౌన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కెనడియన్ ముస్లిమ్స్ (NCCM) అనే ఒక సంస్థ ఒక యొక్క CEO. ఈ వీడియోలో బ్రౌన్ RSSపై నిషేధం విధించమని కోరుతున్నారు, అంతే కానీ అధికారికంగా నిషేధం ప్రకటించడం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి NCCM అని అనడం మేము గమనించాము. ఈ క్లూ ఆధారంగా తగిన కీవర్డ్స్ (NCCM RSS ban) ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికితే, 20 సెప్టెంబర్ 2023న ‘NCCMTV’ అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేయబడిన ఇదే వైరల్ వీడియో యొక్క అధిక నిడివి గల వీడియో మాకు లభించింది.
వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి తనను తాను స్టీఫెన్ బ్రౌన్‌గా పరిచయం చేసుకుంటూ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కెనడియన్ ముస్లిమ్స్ (NCCM ఒక స్వతంత్ర సంస్థ) యొక్క CEO అని పేర్కొన్నాడు. ఈ వీడియో NCCM మరియు వరల్డ్ సిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ కెనడా (WSO) సంయుక్తంగా నిర్వహించిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భాగంగా ఉంది, మాకు తెలిసింది.
ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో, NCCM CEO స్టీఫెన్ బ్రౌన్ RSSపై నిషేధాన్ని కోరుతూ, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత ప్రభుత్వ ప్రమేయంపై కెనడా ఆరోపణల నేపథ్యంలో మూడు అదనపు డిమాండ్లను సమర్పించారు.

RSSపై కెనడా ప్రభుత్వం నిషేధం విధించిందా? లేదా? అని తెలుసుకోవడానికి, మేము కెనడా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను కూడా పరిశీలించాము. కానీ, వైరల్ క్లెయింను సమర్ధించే ఎటువంటి సమాచారం మాకు లభించలేదు.
చివరిగా, కెనడా ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించి, దాని కార్యకర్తలను దేశం విడిచి వెళ్లమని ఆదేశించిందనే వాదనలో నిజం లేదు.