Fake News, Telugu
 

మిగితా వాటికంటే కరోనా 501.V2 స్ట్రెయిన్ ప్రమాదకరం అని చెప్పడానికి ఇప్పటివరకైతే ఆధారాలు లేవు

0

దక్షిణాఫ్రికాలో కొత్త రకం కరోనా 501.V2 స్ట్రెయిన్ గుర్తించబడిందని, అది మిగితా స్ట్రెయిన్ల కంటే మరింత ప్రమాదకరమైనదని చెప్తున్న ఒక వార్త ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మిగితా వాటి కంటే దక్షిణాఫ్రికా లో గుర్తించిన కరోనా 501.V2 స్ట్రెయిన్ చాలా ప్రమాదకరమైనది.

ఫాక్ట్: ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం దక్షిణాఫ్రికా లో గుర్తించిన కరోనా 501.V2 స్ట్రెయిన్ వల్ల ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం లేదా ఎక్కువ మరణాలు సంభవిస్తాయని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్సైటులో చూడవొచ్చు. 501.V2 స్ట్రెయిన్ వల్ల కోవిడ్-19 వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చని ప్రాధమిక అధ్యయనాల్లో తెలిసిందని, అయితే ఇంకా పరిశోధనలు జరపాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

దక్షిణాఫ్రికా లో గుర్తించిన కరోనా 501.V2 స్ట్రెయిన్ గురించి ఇంటర్నెట్ లో వెతకగా, బ్రిటన్ స్ట్రెయిన్ కంటే 501.V2 స్ట్రెయిన్ ప్రమాదకరం అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని, దాని పై పరిశోధనలు జరుగుతున్నట్టు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఒక ప్రెస్ రిలీజ్ విడుదల చేసినట్టు తెలిసింది.

501.V2 స్ట్రెయిన్ వల్ల కోవిడ్-19 వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చని ప్రాధమిక అధ్యయనాల్లో తెలిసిందని, అయితే ఇంకా పరిశోధనలు జరపాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంతేకాదు, 501.V2 స్ట్రెయిన్ వల్ల ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం లేదా ఎక్కువ మరణాలు సంభవిస్తాయని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్సైటులో చూడవొచ్చు. ఇదే విషయం సీడీసీ మరియు యురోపియన్ యూనియన్ హెల్త్ వెబ్సైటుల్లో కూడా చదవొచ్చు.

చివరగా, మిగితా వాటికంటే దక్షిణాఫ్రికా లో గుర్తించిన కరోనా 501.V2 స్ట్రెయిన్ చాలా ప్రమాదకరం అని చెప్పడానికి ఇప్పటివరకైతే ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll