Fake News, Telugu
 

ద్వారంలో నుండి సూర్యకిరణాలు వస్తున్న ఈ ఫోటో ఒడిశా లోని కోణార్క్ సూర్య దేవాలయానిది కాదు

0

ఒక ద్వారంలో నుండి సూర్యకిరణాలు వస్తున్న ఫోటో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, అందులో ఉన్నది ఒడిశా లోని కోణార్క్ సూర్య దేవాలయం అని చెప్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ద్వారంలో నుండి సూర్యకిరణాలు వస్తున్న ఈ ఫోటో ఒడిశా లోని కోణార్క్ సూర్య దేవాలయానిది.

ఫాక్ట్ (నిజం): ఫోటో లో ఉన్నది ఒడిశా లోని కోణార్క్ సూర్య దేవాలయం కాదు. అది థాయిలాండ్‌లోని ఫనోమ్ రంగ్ దేవాలయం. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ ఫోటో ఒక ట్వీట్ లో లభించింది. ఆ ట్వీట్ లో యూజర్ ఫోటో నేపాల్ లోని ఒక దేవాలయనిది అని పెట్టగా, కామెంట్స్ లో మరొక యూజర్ అది థాయిలాండ్‌లోని ఫనోమ్ రంగ్ దేవాలయం అని పేర్కొన్నాడు. దాంతో గూగుల్ లో థాయిలాండ్‌లోని ఫనోమ్ రంగ్ దేవాలయం గురించి వెతకగా, ఒక బ్లాగ్లో రాసిన ఆర్టికల్ లభించింది. ఆ ఆర్టికల్ లో పోస్టులో ఫోటో లాంటిదే మరొక ఫోటో ఉంది. ఆ దేవాలయానిలో చాలా ద్వారాలు ఉన్నాయి, కానీ ఆ రెండు ఫోటోల్లో ద్వారానికి సంబంధించి అనేక పోలికలు చూడవచ్చు.

ఫనోమ్ రంగ్ దేవాలయానికి సంబంధించిన అలాంటి ద్వారాన్నే గూగుల్ స్ట్రీట్ వ్యూ లో కూడా చూడవచ్చు.

ఫేస్బుక్ లో మరికొన్ని ఫోటోలు కూడా కోణార్క్ సూర్య దేవాలయానివనే ఆరోపణతో వేరే భాషల్లో షేర్ అవుతున్నాయి. వాటి గురించి FACTLY రాసిన ఫాక్ట్-చెక్ కథనం ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ద్వారంలో నుండి సూర్యకిరణాలు వస్తున్న ఫోటో ఒడిశా లోని కోణార్క్ సూర్య దేవాలయానిది కాదు; థాయిలాండ్‌లోని ఫనోమ్ రంగ్ దేవాలయానిది.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll