Fake News, Telugu
 

భారీ గుంతలతో ఉన్న ఈ రోడ్డు ఆంధ్రప్రదేశ్‌కు చెందినది కాదు

0

వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రహదారుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా ప్రచారంలో ఉంది. ఈ వీడియోలో భారీ గుంతలతో ఉన్న రోడ్డు పైన లారీలు ప్రమాదకరంగా వెళ్ళడం చూడవచ్చు. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పడు చూద్దాం.

క్లెయిమ్: వై. ఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్లో రోడ్ల పరిస్థితిని చూపుతున్న వీడియో.

ఫాక్ట్: పోస్టులో షేర్ చేసిన వీడియో 06 నవంబర్ 2019లో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఎక్కువ నిడివి గల వీడియో నుంచి తీసుకున్నారు. వాహనాల నెంబర్ ప్లేట్ అన్నీ నాగాలాండ్ (NL) లేదా పశ్చిమ బెంగాల్ (WB) రిజిస్ట్రేషన్ తో ఉన్నాయి. అందువలన ఈ ప్రదేశం ఈశాన్య రాష్ట్రాలకు చెందినది అని చెప్పవచ్చు. కావున, ఈ పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.  

ముందుగా వైరల్ అవుతున్న వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే దృశ్యాలతో ఉన్న యూట్యూబ్ వీడియో లభించింది. ఈ వీడియో 06 నవంబర్ 2019న “Entertainment World” అనే ఛానెల్లో అప్లోడ్ చేయబడింది. వైరల్ అవుతున్న వీడియోలోని దృశ్యాలు ఈ వీడియోలో 6:40 మరియు 0:30 దగ్గర చూడవచ్చు.

అయితే, ఈ వీడియోలో కనిపించే లారీల నెంబర్ ప్లేట్‌లను గమనించగా ఇవి అన్నీ నాగాలాండ్ (NL) లేదు పశ్చిమ బెంగాల్ (WB) రిజిస్ట్రేషన్ తో ఉన్నాయి. వీడియోలో ఉన్న ప్రదేశం ఎక్కడో కచ్చితంగా తెలియనప్పటికీ, లారీల నెంబర్ ప్లేట్‌లను బట్టి అది ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినది గా చెప్పవచ్చు.

ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రోడ్లు దెబ్బతిన్నట్లు వార్తా కథనాలు వచ్చినప్పటికీ, వైరల్ అవుతున్న వీడియో వీటికి సంబంధించినది కాదు.

చివరిగా, భారీ గుంతలతో ఉన్న ఈ రోడ్డు ఆంధ్ర ప్రదేశ్‌కు చెందినది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll