హైదరాబాద్ లోని ఇసామియా బజారులో ఉన్న గణేష్ మండపం పైన కత్తులతో 20 మంది ముస్లింల దాడి అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. మండపంపై పూజలో ఉన్న ఆడవాళ్లపై, మగవాళ్లపై, పిల్లలపై నెత్తులు పగలగొడుతూ దాడి చేశారని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇసామియా బజారులో ఉన్న గణేష్ మండపం పైన కత్తులతో 20 మంది ముస్లింలు దాడి చేసారు.
ఫాక్ట్: కాచిగూడ పోలీస్ స్టేషన్ ని FACTLY సంప్రదించినప్పుడు, పోస్టులో చెప్పినట్టుగా ఇసామియా బజారులో అటువంటి సంఘటన ఏదీ జరగలేదని వారు మాకు చెప్పారు. ఇసామియా బజారులో ఉన్న గణేష్ మండపం పైన కత్తులతో 20 మంది ముస్లింలు దాడి చేసారని ఎటువంటి వార్తా కథనాలు మాకు లభించలేదు. ఇసామియా బజారులో ఇద్దరు వ్యక్తులు (వినోద్ రాజ్ మరియు అబ్దుల్లా), వారి వర్గాలు గొడవ పడగా, ఇరువురికి గాయాలయ్యాయని ఈనాడు వార్తా పత్రిక తెలిపింది. కానీ, ఈ గొడవ వ్యక్తిగతంగా జరిగిందని, ఇసామియా బజారులో ఉన్న గణేష్ మండపంలో జరగలేదని, దాని సమీపంలో గొడవపడ్డారని కాచిగూడ పోలిస్ స్టేషన్ వారు FACTLY తో మాట్లాడినప్పుడు చెప్పారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
కాచిగూడ పోలీస్ స్టేషన్, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లను FACTLY సంప్రదించినప్పుడు, పోస్టులో చెప్పినట్టుగా ఇసామియా బజారులో అటువంటి సంఘటన ఏమి జరగలేదని వారు మాకు చెప్పారు. ఇసామియా బజారులో ఉన్న గణేష్ మండపం పైన కత్తులతో 20 మంది ముస్లింలు దాడి చేసారని ఎటువంటి వార్తా కథనాలు మాకు లభించలేదు.
ఈనాడు పత్రికలో, ఇసామియా బజారులో జరిగిన ఒక సంఘటన గురుంచి రిపోర్ట్ చేసారు. ఇసామియా బజారులో ఇద్దరు వ్యక్తులు (వినోద్ రాజ్ మరియు అబ్దుల్లా), వారి వర్గాలు గొడవ పడగా, ఇరువురికి గాయాలయ్యాయని తెలిపారు. “వారు తమ వర్గీయులతో వచ్చి పరస్పరం దాడులకు దిగారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.” గణేష్ మండపంపైన కత్తులతో వచ్చి దాడి చేసినట్టు ఈ రిపోర్టులో లేదు.
ఇరు వర్గాల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు కేసులు నమోదు చేసారు, వాటి FIR కాపీలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. 13 సెప్టెంబర్ 2021 రాత్రి 11:30 కి కోటి నుండి మోతీమార్కెట్ రోడ్ మీద ఇరువురికి (వినోద్ రాజ్ మరియు అబ్దుల్లా), వారి వర్గాలకు గొడవ అవడంతో , తనపై దాడి చేసారని వినోద్ రాజ్, లేదు తమపై దాడి చేసారని ఆయుబ్ ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులు పోలీసులకు FIR కాపీల్లో స్టేట్మెంట్లు ఇచ్చారు.
ఈ గొడవ వ్యక్తిగతంగా జరిగిందని, ఇసామియా బజారులో ఉన్న గణేష్ మండపంలో జరగలేదని, దాని సమీపంలో గొడవ పడ్డారని కాచిగూడ పోలిస్ స్టేషన్ వారు Factly తో మాట్లాడినప్పుడు చెప్పారు.
చివరగా, “ఇసామియా బజారులో ఉన్న గణేష్ మండపం పైన కత్తులతో 20 మంది ముస్లింల దాడి” అంటూ ఇలా షేర్ చేస్తున్న పోస్టు తప్పుదోవ పట్టించేదిగా ఉంది.