Fake News, Telugu
 

భారతదేశం యొక్క 2014 GDP (PPP) ర్యాంక్‌ను 2018 GDP (నామినల్) ర్యాంక్‌తో పోల్చి తప్పుదోవ పట్టిస్తున్నారు

0

2014లో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 3వ స్థానంలో ఉందని, అయితే 2019లో ప్రపంచంలో 5వ స్థానంలో ఉందని పేర్కొంటూ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఇదే విషయంతో  కూడిన మరికొన్ని  పోస్టులు (ఇక్కడ మరియు ఇక్కడ) కూడా షేర్ అవుతున్నయి. పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ లోని నిజానిజాలను ఈ ఆర్టికల్ ద్వారా పరిశీలిద్దాం.

క్లెయిమ్: మన్మోహన్ సింగ్ హయాంలో, భారత ఆర్థిక వ్యవస్థ 2014లో ప్రపంచంలోనే  3వ స్థానంలో ఉంటే, మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ 2019లో ప్రపంచంలో 5వ స్థానానికి  దిగజారింది.

ఫాక్ట్ (నిజం): భారత ఆర్థిక వ్యవస్థ 2014లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ (PPP పరంగా), 2019లో కూడా (PPP పరంగా) అదే స్థానాన్ని నిలుపుకుంది (2018 WB డేటా ప్రకారం). పోస్ట్‌లో, GDP (PPP) ఆధారంగా 2014 ఆర్థిక వ్యవస్థ ర్యాంక్‌ను GDP (నామినల్ వాల్యూ) ఆధారంగా 2018 ఆర్థిక వ్యవస్థ ర్యాంక్‌తో పోల్చారు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

2014లో భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడంపై వార్తల కోసం వెతికినప్పుడు, ఈ అంశంపై ‘ది ఎకనామిక్ టైమ్స్’ వారి వార్తా కథనం లభించింది. ఆ కథనం ప్రకారం, భారత ఆర్థిక వ్యవస్థ PPP (పర్చేసింగ్ పవర్ పారిటీ ) పరంగా జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఈ ర్యాంక్ ప్రపంచ బ్యాంక్ యొక్క ఇంటర్నేషనల్ కంపారిజన్ ప్రోగ్రామ్ (ICP) (2011) నిర్వహించిన సర్వే ఆధారంగా ఇచ్చారు. దీని కంటే ముందు ఈ సర్వే 2005లో నిర్వహించబడింది.

అలాగే, 2019లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్థానంపై వార్తల కోసం వెతకగా, ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన 2018 గ్లోబల్ జిడిపి ర్యాంకింగ్స్ ప్రకారం, భారతదేశం 7వ స్థానానికి పడిపోయిందని 2019లో ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రచురించిన కథనంలో లభించింది. కానీ ఈ ర్యాంకింగ్‌లు GDP (PPP) డేటా ఆధారంగా కాకుండా GDP (నామినల్) డేటాపై ఆధారపడి ఉంటాయి. GDP (నామినల్ వాల్యూ) మరియు GDP (PPP) మధ్య వ్యత్యాసాన్ని ఇక్కడ చదవవచ్చు.

2018లో GDP (PPP) డేటా ఆధారంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ 3వ స్థానంలోనే ఉంది . భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ 2021లో కూడా (PPP పరంగా) ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని కలిగి ఉంది.

ప్రపంచ బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న డేటా [GDP (ప్రస్తుత US$) మరియు GDP-PPP (ప్రస్తుత అంతర్జాతీయ $)] ఆధారంగా, 2004 నుండి 2018 వరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ర్యాంకింగ్ క్రింది పట్టికలో చూడవచ్చు:

ఇటీవల, నామినల్ GDP ఆధారంగా  భారతదేశం 5వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా స్థానం సంపాదించుకుంది. దీనిగురించి ప్రధాని మోదీ మాట్లాడుతూఇటీవల, భారతదేశం ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన ఘనతను సాధించింది. ఈ విజయం ఈ అమృత కాలంలో  మరింత కష్టపడి పని చేయడానికి మరియు పెద్ద లక్ష్యాలను సాధించడానికి మాకు విశ్వాసాన్ని ఇచ్చింది,’ అని అన్నారు.

చివరగా, భారతదేశం యొక్క 2014 GDP (PPP) ర్యాంక్‌ను 2018 GDP (నామినల్) ర్యాంక్‌తో పోల్చడం ద్వారా పోస్ట్ తప్పుదోవ పట్టిస్తోంది.

Share.

About Author

Comments are closed.

scroll