Fake News, Telugu
 

ఖలీజ్ టైమ్స్ 2019లో నరేంద్ర మోదీకి సంబంధించి పబ్లిష్ చేసిన 40 పేజీల ప్రత్యేక ఎడిషన్‌ను ఇటీవల మోదీ పుట్టినరోజు సందర్భంగా పబ్లిష్ చేసినదిగా షేర్ చేస్తున్నారు

0

 “సెప్టెంబర్ 17వ తేదీ ప్రధాని మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా దుబయ్‌లోని ఖలీజు టైమ్స్ దుబాయ్వార్తా పత్రికలో 40 పేజీలు లో 20 పేజీలు మోడీ ఫోటోలు వేసుకొని పెద్ద సంఖ్యలో ప్రకటనలు ఇచ్చిన అక్కడి వ్యాపారులు”, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. దుబాయి పత్రికలో నరేంద్ర మోదీ హవా అని తెలుపుతూ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

  

క్లెయిమ్: నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా దుబాయి ఖలీజ్ టైమ్స్ వార్తా పత్రికలో 20 పేజీలలో నరేంద్ర మోదీ ఫోటోలను వేయించిన అక్కడి వ్యాపారులు. 

ఫాక్ట్ : ఈ వీడియోలో కనిపిస్తున్న 40 పేజీల ప్రత్యేక ఎడిషన్‌ను ఖలీజ్ టైమ్స్ 2019లో నరేంద్ర మోదీ రెండవసారి ప్రధానిమంత్రి అయిన తరువాత పబ్లిష్ చేసింది. అదే ఏడాది నరేంద్ర మోదీ UAE అత్యున్నత పురస్కారం పొందినప్పుడు కూడా ఖలీజ్ టైమ్స్ నరేంద్ర మోదీకి సంబంధించి 50 పేజీల ప్రత్యేక ఎడిషన్‌ను పబ్లిష్ చేసింది. కానీ, ఇటీవల నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఖలీజ్ టైమ్స్ అటువంటి ప్రత్యేక పత్రికను ఏది పబ్లిష్ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని పలు సోషల్ మీడియా యూసర్లు 2019లోనే షేర్ చేసినట్టు తెలిసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. నరేంద్ర మోదీకి సంబంధించి ఖలీజ్ టైమ్స్ పబ్లిష్ చేసిన 40 పేజీల ప్రత్యేక ఎడిషన్‌ అని ఈ వీడియోని షేర్ చేస్తూ ఆ యూసర్లు తెలిపారు. 

ఈ ప్రత్యేక ఎడిషన్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఈ వార్తా ఎడిషన్‌ ఫ్రంట్ పేజీ ఫోటోని ఖలీజ్ టైమ్స్ వార్తా సంస్థ 02 జూన్ 2019 నాడు తమ ఫేస్‌బుక్ పేజీలో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కూడా ఈ ఎడిషన్‌ ఫ్రంట్ పేజీ ఫోటోని 2019 జూన్ నెలలో ట్వీట్ చేసింది.  

2019 ఆగస్టు నెలలో నరేంద్ర మోదీకి UAE అత్యున్నత పురస్కారం ‘జాయేద్ మెడల్’ బాహుకరించిన సంధర్బంలో కూడా ఖలీజ్ వార్తా సంస్థ నరేంద్ర మోదీకి సంబంధించి 50 పేజీల ప్రత్యక పత్రికను పబ్లిష్ చేసింది.

నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల నమీబియా నుండి తెచ్చిన చిరుతలను మధ్యప్రదేశ్ కూనా నేషనల్ పార్కులో విడిచిపెట్టిన విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ఖలీజ్ టైమ్స్ 17 సెప్టెంబర్ 2022 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది. అయితే, నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఖలీజ్ టైమ్స్ ఇటీవల మోదీకి సంబంధించి ఎటువంటి ప్రత్యేక పత్రిక ఎడిషన్‌ను పబ్లిష్ చేయలేదు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఖలీజ్ టైమ్స్ 2019లో నరేంద్ర మోదీకి సంబంధించి పబ్లిష్ చేసిన 40 పేజీల ప్రత్యేక ఎడిషన్‌ను ఇటీవల మోదీ పుట్టినరోజు సందర్భంగా పబ్లిష్ చేసినదిగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll