Fake News, Telugu
 

ఈ ఫోటో ఆంధ్రప్రదేశ్ లోని నిడదవోలు రైల్వే స్టేషన్ కి సంబంధించింది, కాచిగూడది కాదు.

0

రైల్వే స్టేషన్ లో పట్టాలపై పూర్తిగా నీరు ఉన్న ఫోటో షేర్ చేసి ఈ ఫోటో కాచిగూడ రైల్వేస్టేషన్ ది అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటీవల హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి కాచిగూడ రైల్వే స్టేషన్ లో పట్టాలు పూర్తిగా నీటమునిగిన ఫోటో.

ఫాక్ట్(నిజం): ఈ ఫోటో ఆంధ్రప్రదేశ్ లోని నిడదవోలు రైల్వే స్టేషన్ కి సంబంధించింది, ఈ ఫోటోకి కాచిగూడ రైల్వే స్టేషన్ కి అసలు సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని ఆంధ్రప్రదేశ్ లోని నిడదవోలు రైల్వే స్టేషన్ గా షేర్ చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు మాకు కనిపించాయి. దీని ఆధారంగా కీ వర్డ్ సెర్చ్ చేయగా 13 అక్టోబర్ 2020న BBC న్యూస్ తెలుగు తమ ఫేస్ బుక్ అకౌంట్ లో నిడదవోలు రైల్వే స్టేషన్ కి సంబంధించిన వీడియో షేర్ చేసిన పోస్టు కనిపించింది. ఐతే ఈ వీడియోలో విజువల్స్ పోస్టులో ఉన్న ఫోటో ఒకేలా ఉన్నాయి, దీన్నిబట్టి ఈ ఫోటో నిడదవోలు రైల్వే స్టేషన్ దని చెప్పొచ్చు.

నిడదవోలు రైల్వే స్టేషన్ లో పట్టాలపై చేరిన వర్షపు నీటి గురించిన వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు. దీన్నిబట్టి పోస్టులో ఉన్న ఫోటో కాచిగూడ రైల్వే స్టేషన్ కి సంబంధించింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

ఇటీవల హైదరాబాద్ లో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సంబంధంలేని ఫోటోలు, వీడియోలను విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, పోస్టులో ఉన్న ఫోటో ఆంధ్రప్రదేశ్ లోని నిడదవోలు రైల్వే స్టేషన్ కి సంబంధించింది, కాచిగూడ రైల్వే స్టేషన్ ది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll