Fake News, Telugu
 

ఆడవారు వేసుకునే దుస్తులు ప్రధాని మోదీ వేసుకున్నట్టు షేర్ చేస్తున్న ఈ ఫోటో ఎడిట్ చేయబడినది

0

ఆడవారు వేసుకునే దుస్తులని ప్రధాని నరేంద్ర మోదీ వేసుకున్నట్టు చూపుతూ, ఒక ఫోటోతో కూడిన పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఆడవారు వేసుకునే దుస్తులు ప్రధాని నరేంద్ర మోదీ వేసుకున్నట్టు ఫోటోలో చూడవచ్చు.

ఫాక్ట్: పోస్ట్‌లో షేర్ చేసిన షాపింగ్ వెబ్సైట్ ఫోటో ఎడిట్ చేయబడినది. ప్రధాని మోదీ వేసుకున్న దుస్తులు ఒరిజినల్ ఫోటోలో ఆ షాపింగ్ వెబ్సైటులోని మహిళ వేసుకోలేదు. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లో ప్రధాని మోదీ ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, అది తాజాగా ప్రధాని మోదీ మేఘాలయ వెళ్ళినప్పుడు తీసిన ఫోటో అని తెలిసింది. ఫొటోలో మేఘాలయాకి సంబంధించిన తెగల సాంప్రదాయ దుస్తులని ప్రధాని మోదీ వేసుకున్నట్టు ‘ANI’ అర్టికల్‌లో చదవచ్చు. మేఘాలయ సాంప్రదాయ దుస్తులని ప్రధాని మోదీ వేసుకోవడం ఇది మొదటసారి కాదు; ఇంతకముందు కూడా తాను ఇలాంటి దుస్తులు వేసుకున్నట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

అయితే, పోస్ట్‌లో పెట్టిన షాపింగ్ వెబ్సైట్ ఫోటో ఎడిట్ చేయబడినది. ప్రధాని మోదీ వేసుకున్న దుస్తులు ఒరిజినల్ ఫోటోలో ఆ షాపింగ్ వెబ్సైటులోని మహిళ వేసుకోలేదు.

ప్రధాని మోదీ వేసుకున్నప్పుడు దుస్తుల్లో ఎక్కడెక్కడ ముడతలు ఉన్నాయో, పోస్ట్‌లో మహిళ వేసుకున్న డ్రెస్‌లో కూడా అక్కడే ముడతలు ఉన్నాయి. కాబట్టి, ప్రధాని మోదీ వేసుకున్న డ్రెస్‌ని ఆ మహిళ వేసుకున్నట్టుగా ఎడిట్ చేసారని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

చివరగా, ఆడవారు వేసుకునే దుస్తులు ప్రధాని మోదీ వేసుకున్నట్టు పెట్టిన ఈ ఫోటో ఎడిట్ చేయబడినది.

Share.

About Author

Comments are closed.

scroll