గొలుసులతో చేసిన డ్రెస్ ధరించిన ఒక మహిళ ఫోటో చూపిస్తూ BJP ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేని కారణంగా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఒక మహిళ ఇలా నిరసన తెలుపుతుందని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: BJP ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేని కారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొలుసులతో చేసిన డ్రెస్ ధరించి నిరసన తెలుపుతున్న మహిళ.
ఫాక్ట్(నిజం): గొలుసులతో ఉన్న మహిళకి సంబంధించి మరొక ఫోటో ఒక వెబ్సైట్ లో కనిపించింది. ఈ వెబ్సైట్ లో ఉన్న సమాచారం ప్రకారం శ్రీలంకకి చెందిన ఈ మహిళ palk straits కి చెందిన ఒసారియ వేషధారణలో ఉంది. ఒక శ్రీలంక యూట్యూబ్ ఛానల్ లో గొలుసులతో ఉన్న మహిళకి సంబంధించిన ఒక వీడియో 13 ఫిబ్రవరి 2020న అప్లోడ్ చేయబడింది. దీన్నిబట్టి ఈ వీడియో పాతదని, ఈ మహిళకి భారత దేశంలో జరుగుతున్న నిరసనలకు సంబంధం లేదని చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా పోస్టులో గొలుసులతో ఉన్న మహిళకి సంబంధించి మరోక ఫోటో ఒక వెబ్సైటులో దొరికింది. ఈ వెబ్సైటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ఫోటోలో ఉన్న శ్రీలంక మహిళ palk straits కి చెందిన ఒసారియ వేషధారణలో ఉంది.

పోస్టులో గొలుసులతో ఉన్న మహిళకి సంబంధించిన ఒక వీడియో యూట్యూబ్ లో ఒక శ్రీలంక ఛానల్ లో మాకు దొరికింది. ఈ వీడియో 13 ఫిబ్రవరి 2020న అప్లోడ్ చేసినట్టు ఉంది. ఈ వీడియోకి సంబంధించి టైటిల్ ఈ విధంగా ఉంది ‘valentine day in Sri Lanka- How to send classes on valentine day’. దీన్నిబట్టి ఈ వీడియోలో ఉన్న మహిళకి భారత దేశానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పొచ్చు.

2019లో ఇదే మహిళకి సంబంధించిన ఫోటో ఇదే క్లెయిమ్ తో వైరల్ అయినప్పుడు FACTLY రాసిన ఫాక్ట్-చెక్ కథనం ఇక్కడ చదవొచ్చు.
ఇటీవలే ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన 19 ఏళ్ల యువతి అత్యాచారం ఆరోపణల నేపధ్యంలో పోస్టులో ఉన్న ఫోటో తప్పుడు క్లెయిమ్ తో సోషల్ మీడియా లో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
చివరగా, పోస్టులో గొలుసులతో చేసిన డ్రెస్ ధరించిన మహిళ ఫోటో శ్రీలంకకి చెందినది.