Fake News, Telugu
 

ప్రైవేటు మెడికల్ కాలేజీలల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను యోగీ ఆదిత్యనాథ్ రద్దు చేయలేదు. 2006 నుంచి అదే పాలసీ ఉంది.

0

ఉత్తరప్రదేశ్ లో యోగీ ఆదిత్యనాథ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసాడంటూ ఒక ఆర్టికల్ లింక్ తో ఉన్న పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.    

క్లెయిమ్ (దావా): ఉత్తరప్రదేశ్ లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసిన యోగీ ఆదిత్యనాథ్.    

ఫాక్ట్ (నిజం): 2017 లో ప్రైవేటు మెడికల్ కాలేజీలల్లో ప్రభుత్వం రిజర్వేషన్ తీసేసిందని ఇండియా టుడే ప్రచురించింది. కానీ అసలు ప్రైవేటు మెడికల్ కాలేజీలల్లో రిజర్వేషన్ లేదని అధికారులు తెలుపగా, వారి తప్పు తెలుసుకొని వివరణ ఇస్తూ ఇంకో ఆర్టికల్ కూడా ఇండియా టుడే ప్రచురించింది. ఇప్పుడు మళ్ళీ అది తీసుకొని యోగీ ఆదిత్యనాథ్ రిజర్వేషన్లను రద్దు చేసాడని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. 

పోస్ట్ లో ఇచ్చిన ఆర్టికల్ లింక్ ఓపెన్ చేస్తే దాంట్లో యోగీ ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ లోని ప్రైవేటు మెడికల్ కాలేజీలల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసాడని ఉంటుంది. ఈ విషయం పై వివరాల కొరకు గూగుల్ లో ‘yogi adityanath removed reservation in UP’ అని వెతకగా, సెర్చ్ రిజల్ట్స్ లో ఇండియా టుడే ఆర్టికల్ వస్తుంది. దాని ప్రకారం 2017 లో వారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు మెడికల్ కాలేజీలల్లో రిజర్వేషన్లను తీసేసిందని ప్రచురించారు. కానీ తరువాత అధికారులు అసలు అలాంటి రిజర్వేషన్లు ప్రైవేటు మెడికల్ కాలేజీలల్లో ముందు నుండి లేవని తెలుపగా ఇండియా టుడే తమ తప్పును ఒప్పుకుంటూ వివరణ ఇస్తూ ఇంకో ఆర్టికల్ ప్రచురించారు. దాంట్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు కాలేజీలల్లో రిజర్వేషన్లు తీయడానికి అసలు వాటిల్లో కులం ఆధారంగా రిజర్వేషన్లే లేవని ఉంటుంది. ప్రభుత్వ అధికారుల ప్రకారం ఈ పాలసీ 2006 నుంచి అమల్లో ఉందని, ఇప్పుడు ఎటువంటి కొత్త మార్పు చెయ్యలేదని వివరణ కూడా చూడొచ్చు. ఇదే విషయాన్నీ ‘టైమ్స్ అఫ్ ఇండియా‘ మరియు ‘న్యూ ఇండియన్ ఎక్సప్రెస్స్’ పత్రికలు కూడా ప్రచురించాయి.

2017 లో జరిగిన ఈ విషయాన్ని తీసుకొని మళ్ళీ ఇపుడు అదే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇండియా టుడే ఇంకో ఆర్టికల్ లో ఇప్పుడు తిరిగి ప్రచారం అవుతున్నవి కూడా తప్పు అని ప్రచురించింది.

చివరగా, ప్రైవేటు మెడికల్ కాలేజీలల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను యోగీ ఆదిత్యనాథ్ రద్దు చేయలేదు. 2006 నుంచి అదే పాలసీ ఉంది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll