Fake News, Telugu
 

మనిషి ముఖం ఉన్నట్టు కనిపిస్తున్న ఈ మురికివాడ ఫోటోను AI ద్వారా రూపొందించారు

0

ఒక మురికివాడ యొక్క ఫోటో, మనిషి ముఖం ఆకారంలో ఉంది అంటూ, ఈ ఫోటో తీసిన వ్యక్తికి ‘ఇయర్ అఫ్ ది ఫోటోగ్రఫీ’ బహుమానం ఇవ్వాలి అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ పోస్టులో ఎంత నిజం ఉందో తెలుసుకుందాం.

క్లెయిమ్: ఒక మురికివాడలో వర్షం పడ్డప్పుడు తీసిన ఫోటో మనిషి మొఖం ఆకారంలో ఉంది.

ఫాక్ట్: ఈ ఫోటో రెడ్దిట్ అనే వెబ్సైటు లోని ఒక బ్రజిలియన్ కమ్యూనిటీ ఫోరమ్ లో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్సను (AI) ఉపయోగించి సృష్టించిన ఇమేజ్. ఇదే విధంగా రూపొందించిన మరికొన్ని ఫోటోలను షేర్ చేస్తూ దీనిని రూపొందించిన వ్యక్తి, తనను గుర్తించాలి అనుకోవడం లేదు అని తెలుపుతూ ఒక వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. కావున ఈ క్లెయిమ్  తప్పు.

ఈ ఫోటో గురించి తెలుసుకునేందుకు కీ వర్డ్ సెర్చ్ చేయగా ఈ ఫోటోని షేర్ చేసిన ట్విట్టర్ పోస్ట్లు దొరికాయి (ఇక్కడ మరియు ఇక్కడ). వాటిలో ఒక పోస్టులో ఇలాంటి నాలుగు  చిత్రాలను షేర్ చేస్తూ, ఈ చిత్రాలు రెండు రోజుల క్రితం రెడ్డిట్ గ్రూపులో సృష్టించబడ్డాయని, వీటిని సృష్టించిన వ్యక్తి, తనను గుర్తించాలి అనుకోవడం లేదు అంటూ ఒక వ్యక్తి పోస్ట్ చెయ్యడం జరిగింది.

ఈ పోస్ట్ కింద ఉన్న కామెంట్స్ లో ఉన్న ఫోటోలోని క్యాప్షన్ను వాడి రెడ్దిట్ వెబ్సైట్ ద్వారా అసలైన ఫోటోను వెతకడం జరిగింది. ఇది ఒక బ్రెజిలియన్ సబ్ రెడ్డిట్, ఈ  పోస్ట్ కింద ఉన్న కామెంట్స రూపంలో  అయిన చర్చ ద్వారా అది ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి సృష్టించినట్టు నిర్దారించడం జరిగింది.

చివరిగా, మనిషి ముఖం ఉన్నట్టు కనిపిస్తున్న ఈ మురికివాడ ఫోటో నిజమైనది కాదు, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందించింది.

Share.

About Author

Comments are closed.

scroll